Viral Video: అద్దంలో తనను తాను చూసుకున్న ఎలుగుబంటి.. చివరకు ఎలా రియాక్ట్ అయిందో చూడండి..
ABN , First Publish Date - 2022-07-13T00:41:40+05:30 IST
సింహం, కుందేలు కథ అందరికీ తెలిసే ఉంటుంది. బావిలో తనను తాను చూసుకున్న సింహం.. ఆగ్రహంతో నీటిలోకి దూకుతుంది. ప్రస్తుతం ఓ ఎలుగుబంటికి అలాంటి అనుభవమే ఎదురైంది...
సింహం, కుందేలు కథ అందరికీ తెలిసే ఉంటుంది. బావిలో తనను తాను చూసుకున్న సింహం.. ఆగ్రహంతో నీటిలోకి దూకుతుంది. ప్రస్తుతం ఓ ఎలుగుబంటికి అలాంటి అనుభవమే ఎదురైంది. అడవిలో ఒంటరిగా తిరుగుతున్న సమయంలో ఓ అద్దంలో తనను తాను చూసుకుని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ సందర్భంలో అది ప్రవర్తించిన తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఓ అడవిలో ఎలుగుబంటి ఒంటరిగా తిరుగుతూ ఉంటుంది. ఆ ప్రాంతంలో నిలువుగా ఉన్న అద్దాన్ని ఏర్పాటు చేసుంటారు. ఎలుగుబంటి అటూ ఇటూ తిరుగుతూ అనుకోకుండా అద్దం వద్దకు వస్తుంది. ఒక్కసారిగా అద్దంలో తనను తాను చూసుకుని బెంబేలెత్తిపోతుంది. వామ్మో! ఇదేంటీ అచ్చం నాలాగే ప్రవర్తిస్తోంది.. అనుకుంటూ కంగారుపడుతుంది. భయంతో అద్దం వెనక్కు వెళ్లి చూస్తుంది. అయితే అక్కడ ఎవరూ ఉండకపోవడంతో.. మళ్లీ ముందుకు వస్తుంది. అద్దంలో మళ్లీ తనను తాను చూసుకుని.. అద్దంపై గోర్లతో రక్కుతుంది. అది సాధ్యం కాకపోవడంతో చివరకు అద్దాన్ని విరగ్గొడుతుంది. అక్కడ ఏ జంతువూ లేదనే విషయం.. ఎలుగుబంటికి అప్పుడు అర్థమవుతుంది. ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.