Viral Video: ఈ ఉడుత చాలా స్మార్ట్ గురూ.. అనుమానిస్తూనే... అర చేతిలోని బాదం పప్పును ఎలా తింటోందో చూడండి..
ABN , First Publish Date - 2022-07-04T02:44:51+05:30 IST
మనుషులు కనబడితే ఆమడదూరం పారిపోయే జంతువులు.. ఒక్కోసారి విచిత్రంగా బాగా దగ్గరవుతుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తరచూ..
మనుషులు కనబడితే ఆమడదూరం పారిపోయే జంతువులు.. ఒక్కోసారి విచిత్రంగా బాగా దగ్గరవుతుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తరచూ దర్శనమిస్తుంటాయి. అలాంటి వీడియోలు మిలియన్ల వ్యూస్‌ని సొంతం చేసుకుంటుంటాయి. ప్రస్తుతం మనం అలాంటి వీడియో గురించే మాట్లాడుకోబోతున్నాం. చిన్న చప్పుడు వినపడినా, పత్తా లేకుండా పారిపోయే ఉడుత.. అందుకు విరుద్ధంగా మనిషి చేతిలోని బాదం పప్పును తింటుంది. ఓ వైపు అనుమానిస్తూనే, మరోవైపు చకచకా బాదం పప్పులను తినడం.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి అరచేతిలో బాదం పప్పులను పట్టుకుని ఉంటాడు. వాటిని గమనించిన ఓ బుల్లి ఉడుత.. మెల్లగా అతని వద్దకు వస్తుంది. అరచేయి దగ్గరకు వచ్చి ముందుగా ఒక బాదం పప్పును.. టక్కున నోట్లో వేసుకుంటుంది. తర్వాత చాలా సేపు అనుమానంగా చూస్తుంది. కొంపతీసి.. నన్ను పట్టుకోవడానికి ప్లాన్ ఏమీ వేయలేదు కదా!.. అన్నట్లుగా కొద్దిసేపు అనుమానంగా అలాగే చూస్తుంది. తర్వాత తేరుకుని ఎలాగైతే.. అలా అవుతుంది.. అని అన్నట్లుగా చకచకా కొన్ని బాదం పప్పులను నోట్లో కుక్కేసుకుని, అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ‘‘చిప్‌మంక్ మొదటిసారి బాదంపప్పు రుచి చూస్తోంది’’.. అని క్యాప్షన్ ఇస్తూ వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియో 6మిలియన్లకు పైగా వ్యూస్‌ని సొంతం చేసుకుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.