Viral Video: ఈ చింపాంజీల తెలివి మామూలుగా లేదుగా.. కారును ఎంత శ్రద్ధగా శుభ్రం చేస్తున్నాయో చూడండి..

ABN , First Publish Date - 2021-12-13T02:09:47+05:30 IST

గతంలో సోషల్ మీడియాలో చాలా సార్లు చింపాంజీల వీడియోలు వైరల్ అయ్యాయి. మనుషులు చేసే పనులను చింపాంజీలు మక్కీకి మక్కీ దింపేస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది..

Viral Video: ఈ చింపాంజీల తెలివి మామూలుగా లేదుగా.. కారును ఎంత శ్రద్ధగా శుభ్రం చేస్తున్నాయో చూడండి..

మనుషులను చాలా జంతువులు అనుకరిస్తుంటాయి. అయితే చింపాంజీలు అనుకరించినంత స్థాయిలో మిగతా జంతువులు చేయలేవు. చింపాజీల డీన్‌ఏ, మనుషుల డీఎన్‌ఏకు చాలా దగ్గరగా ఉంటుందనేది తెలిసిందే. అందుకే చింపాజీలు వ్యవహరించే తీరు.. అవి చేసే పనులు చూస్తే.. అచ్చు మనుషులు చేసినట్లుగానే ఉంటాయి. గతంలో సోషల్ మీడియాలో చాలా సార్లు చింపాంజీల వీడియోలు వైరల్ అయ్యాయి. మనుషులు చేసే పనులను చింపాంజీలు మక్కీకి మక్కీ దింపేస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

పొలంలో కనిపించినవి పిల్లి కూనలే అనుకుని పులి పిల్లలను ఇంటికి తెచ్చిన రైతు.. రోజూ పాలు పోసి, స్నానం చేయించేవాడు.. చివరకు..


ఆ వీడియోలో ఓ నల్లటి కారును శుభ్రం చేసే పనిలో చింపాంజీలు నిమగ్నమై ఉండడాన్ని మనం గమనించవచ్చు. మనుషులు కూడా అంత శ్రద్ధగా కారును కడగలేరు అన్నంతగా.. ఆ రెండు చింపాంజీలు వ్యవహరించాయి. సబ్బు పెట్టి మరీ కారును శుభ్రం చేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఒకదానికి మరొకటి సహకరించుకుంటూ కారును చాలా జాగ్రత్తగా శుభ్రం చేసే క్రమంలో ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా ‘‘ కారు ఓనర్‌కు పనిభారాన్ని తగ్గిస్తున్నాయంటూ’’.. చమత్కరిస్తున్నారు.

మా కుక్కను ఎందుకు కొడుతున్నారు.. అని యువతి అన్నందుకు.. అర్ధరాత్రి అందరి ముందే ఆ ఆకతాయిలు చేసిన పని..



Updated Date - 2021-12-13T02:09:47+05:30 IST