Viral Video: భార్య, ఐదేళ్ల కూతురు.. ఎదురుగా రెండు కంటైనర్లు.. ఆ తండ్రి చేసిన పనికి నెటిజన్లు ఫిదా..
ABN , First Publish Date - 2022-04-09T17:22:14+05:30 IST
కూతురు పుట్టిందని తెలియగానే.. చెత్తకుండీల్లో వేసే వారు కొందరైతే.. గొంతు నులిమి చంపేవారు ఇంకొందరు ఉంటారు. మరికొందరైతే ముందుగానే స్కానింగ్ చేయించి, ఆడ పిల్ల అని తెలిస్తే..
కూతురు పుట్టిందని తెలియగానే.. చెత్తకుండీల్లో వేసే వారు కొందరైతే.. గొంతు నులిమి చంపేవారు ఇంకొందరు ఉంటారు. మరికొందరైతే ముందుగానే స్కానింగ్ చేయించి, ఆడ పిల్ల అని తెలిస్తే.. అబార్షన్ చేయించడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఈ రోజుల్లో ఆడపిల్లను ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులు చాలా అరుదుగా ఉంటారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే తండ్రి... ఆ అరుదైన వారిలో ముందు వరుసలో ఉంటాడు. ఎదురెదురుగా రెండు కంటైనర్లు ఉండగా.. తన ఐదేళ్ల కూతురును ఎత్తుకుని అతడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు..
ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. భార్యాభర్తలు కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు రెండు ట్రక్కులు కొంటారు. కొత్తగా వాహనాలు కొన్న సమయంలో ఎవరైనా ముందుగా పూజ చేయించి.. కుంకుమ, పసుపు బొట్లు పెట్టడం సాధారణం. అయితే ఇప్పుడు మనం చూడబోయే దంపతులు మాత్రం.. వాహనాలను వినూత్నంగా ప్రారంభించి, అందరి ప్రశంసలు అందుకున్నారు. కొత్త ట్రక్కులను పక్కపక్కనే ఉంచి.. తమ కుమార్తెను ఎత్తుకుని, చిన్నారి పాదాలను పసుపు, కుంకుమ నీళ్లలో అద్దుతాడు. అనంతరం రెండు ట్రక్కుల ముందు భాగంపై పాప పాదముద్రలను వేస్తాడు.
లోకల్ ట్రైన్‌లో గుర్రం ప్రత్యక్షం.. అవాక్కైన ప్రయాణికులు.. ఫొటో వైరల్ కావడంతో చివరకు షాకింగ్ ట్విస్ట్..!
అంతేకాకుండా తమ వ్యాపారాన్ని ‘‘బేటియా ఆశీర్వాదాలు’’ అనే పేరుతో ప్రారంభించడం.. అందరినీ ఆకట్టుకుంటోంది. ఆడపిల్లల తల్లిదండ్రులు వీరిని చూసి ఎంతో నేర్చుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఇలాంటి మంచి మనసున్న తండ్రి చాలా అరుదుగా ఉంటారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో.. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.