Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 19 2021 @ 12:40PM

Pakistani మహిళా ఎమ్మెల్యే ఆషిక్ పేరిట అశ్లీల వీడియో వైరల్...పోలీసులకు ఫిర్యాదు

లాహోర్(పాకిస్థాన్): పాకిస్థాన్ మహిళా ఎమ్మెల్యే సానియా ఆషిక్ పేరిట అసభ్యకరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఎమ్మెల్యే సానియా, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్‌తో వీడియోలో సన్నిహితంగా ఉన్నట్లు సమాచారం.తన పేరిట వచ్చిన అశ్లీల వీడియోపై అక్టోబర్ 26వతేదీన ఎమ్మెల్యే సానియా ఆషిక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ)కి ఫిర్యాదు చేశారు. చాలా రోజులుగా సోషల్ మీడియాలో ఓ అశ్లీల వీడియో వైరల్ అవుతుందని ఆమె ఆరోపించారు. వీడియోలో ఉన్నది తానేనని సోషల్ మీడియాలో క్లెయిమ్ చేస్తున్నారని,కాని అది వాస్తవం కాదని ఎమ్మెల్యే  ఖండించారు. 

ఈ వీడియోతో ఎదురైన వేధింపుల వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై ఎమ్మెల్యే సానియా ఇమ్రాన్ ఖాన్ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు తర్వాత పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన పోలీసులు, ఎఫ్‌ఐఏ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.ఈ విచారణ మూడు వారాల పాటు కొనసాగింది. పోలీసులు లాహోర్‌కు చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు, అయితే ఆ వ్యక్తి యొక్క గుర్తింపును వెల్లడించలేదు. ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ సానియానా లేక మరెవరో పోలీసులు కూడా ధృవీకరించ లేదు. సానియా మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్‌తో సన్నిహితంగా మెలిగారు. ఇమ్రాన్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే సానియా పలు విషయాల్లో విమర్శల వర్షం కురిపించారు.


Advertisement
Advertisement