Viral Video: ఈ మెట్లను మడతపెట్టొచ్చు.. చూశారంటే.. వావ్! ఏం డిజైనింగ్.. అని మీరే అంటారు..

ABN , First Publish Date - 2022-07-16T22:57:09+05:30 IST

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏమాత్రం సృజనాత్మకత, కొత్తదనం లేకపోతే.. వెనుకబడిపోవడం ఖాయం. అయితే కొంత మంది మాత్రం కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ అందరినీ...

Viral Video: ఈ మెట్లను మడతపెట్టొచ్చు.. చూశారంటే.. వావ్! ఏం డిజైనింగ్.. అని మీరే అంటారు..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏమాత్రం సృజనాత్మకత, కొత్తదనం లేకపోతే.. వెనుకబడిపోవడం ఖాయం. అయితే కొంత మంది మాత్రం కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. కొన్ని ఆవిష్కరణలు చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఈ కోవకే చెందుతుంది. ఇళ్లకు మెట్లు(stairs) ఉండడం సర్వసాధారణం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మెట్లు చాలా వెరైటీ. అవసరం లేనప్పుడు వీటిని ఎంచక్కా.. మడతపెట్టొచ్చు. ఏంటీ! ఆశ్చర్యంగా ఉందా.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra)కు కూడా ఇలాగే ఆశ్చర్యం కలిగింది. వెంటనే ఆ వీడియోను తన ట్విటర్(Twitter) ఖాతాలో పోస్టు చేశారు..


జనాభా పెరుగుదలతో పాటూ ఇళ్ల స్థలాలు రోజురోజుకూ పైపైకి ఎగబాకుతుండడంతో పట్టణాలు, నగరాల్లో.. కాస్త ఖాళీ స్థలం ఉన్నా బిల్డింగ్‌లను కట్టేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆశ్చర్యం కలిగేలా.. అగ్గిపెట్టెలాంటి ఇళ్లు కూడా కట్టేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో.. మనం ఇప్పుడు చెప్పుకోబోయే మెట్లు చాలా బాగా ఉపయోగపడతాయి. అవసరం లేనప్పుడు వీటిని గోడకు అతుక్కుపోయేలా మడతపెట్టొచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ఆనంద్ మహీంద్రాను తెగ ఆకట్టుకుందట. ఇది ఎక్కడ జరిగిందో తెలీదు కానీ.. నన్ను చాలా ఆకట్టుకుంది.. అంటూ వీడియోను షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Florida Lockdown: ఆ చిన్న ప్రాణికి.. అమెరికానే వణికింది.. రెండేళ్ల పాటు కొత్త తరహా లాక్‌డౌన్..





Updated Date - 2022-07-16T22:57:09+05:30 IST