Abn logo
Oct 24 2021 @ 20:01PM

12-3-30 ఫార్ములాతో ఇట్టే బరువు తగ్గుతారట.. మీరూ ట్రై చేయండి మరి..

బరువున్న వారు ఎప్పుడెప్పుడు తగ్గుదామా అని కలలు కంటూ ఉంటారు. అందుకోసం ఏవేవో ట్రై చేస్తూ ఉంటారు. బరువు తగ్గిస్తామంటే ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. అయితే ఏ ఖర్చూ లేకుండా.. కేవలం ఒక ఫార్ములాను పాటిస్తే ఇట్టే బరువు తగ్గిపోతారట. దీనికి టిక్‌టాక్ ఫార్ములా అని పేరు పెట్టిందో యువతి. ప్రస్తుతం టిక్‌టాక్‌లో ఈ వార్త వైరల్ అవుతోంది..

సోషల్ మీడియాలో లారెన్ గిరాల్డ్ పోస్ట్ చేసిన వీడియో.. వైరల్ అవుతోంది. తమ బామ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి ట్రెడ్ మిల్‌లో కొన్ని సెట్టింగ్స్ చేశానని చెప్పింది. ట్రెడ్‌మిల్‌పై ఇంక్లైన్ లెవల్ 12, గంటకు మూడు మైళ్ల వేగం సెట్ చేసుకుని.. 30 నిమిషాలు ఒకేసారి ఆపకుండా నడవాలని చెబుతోంది. ఇలా చేయడం ద్వారా 12 నుంచి 13 కేజీల బరువు తగ్గుతారని గిరాల్డ్ బల్ల గుద్ది చెబుతోంది.

ఇలా చేయడం వల్ల గుండెకు కూడా మంచిదని తెలిపింది. 12-3-30 ఫార్ములాను మొదటగా నిదానంగా ప్రారంభించి.. తర్వాత పెంచుకుంటూ పోతే వేగంగా బరువు తగ్గుతారని అంటోంది. కఠినమైన వ్యాయామాలు చేయలేని వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుందని నిపుణులు కూడా చెబుతున్నారు.

ప్రత్యేకంమరిన్ని...