80,509 మందికి విద్యాదీవెన

ABN , First Publish Date - 2021-07-29T06:28:28+05:30 IST

రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన పథకం కింద రెండవ విడత నిధులను ఈనెల 29వ తేదీన విడుదల చేయనున్నారు.

80,509 మందికి విద్యాదీవెన

నేడు తల్లుల ఖాతాలకు జమ

జిల్లాకు రూ.54.02 కోట్లు

ఒంగోలు నగరం, జూలై 28 : రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన పథకం కింద రెండవ విడత నిధులను ఈనెల 29వ తేదీన విడుదల చేయనున్నారు. జిల్లాలోని 80,509 మంది విద్యార్థులకు ఫీజుల చెల్లింపు కింద రూ.54,01,88,081ను విడుదల చేయనున్నారు. ఈ మొత్తాన్ని గురువారం విద్యార్థుల తల్లుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేయనుంది. రాష్ట్రప్రభుత్వం జగనన్న విద్యాదీవెన పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన విద్యార్థులకు ఫీజులను చెల్లిస్తోంది. డిగ్రీ నుంచి పీజీ వరకు చదువుతున్న  విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో ఈ సొమ్మును జమ చేయనున్నారు. జిల్లాలోని 594 కళాశాలల్లో చదువుతున్న 80,509 మంది విద్యార్థులకు చెందిన తల్లుల ఖాతాల్లో సొమ్మును రాష్ట్రప్రభుత్వం జమ చేయనుంది. ఇందులో సాంఘిక సంక్షేమశాఖ ద్వారా 21,448 మంది, గిరిజన సంక్షేమశాఖ ద్వారా 2,198మంది, బీసీ సంక్షేమ శాఖ ద్వారా 26880 మంది , ఈబీసీ 20,915 మంది. ముస్లిం మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా 4,856 మంది, కాపులకు 4,113, క్రిస్టియన్‌ మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా 99మంది విద్యార్థులకు ఫీజులు రాష్ట్రప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రకాశం భవనంలో నిర్వహిస్తారు. సీఎం జగన్మోహనరెడ్డి ప్రారంభించే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వీడియో కాన్పరెన్సు ద్వారా వీక్షించనున్నారు. కొంతమంది లబ్ధిదారులు, జిల్లా అధికారులు పాల్గొంటారు. 



Updated Date - 2021-07-29T06:28:28+05:30 IST