Abn logo
Aug 11 2020 @ 04:01AM

పాడి రైతుల సంక్షేమమే ధ్యేయం : చలసాని

గుడ్లవల్లేరు, ఆగస్టు 10: పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా కృష్ణా మిల్క్‌ యూనియన్‌ పని చేస్తోందని విజయ డెయిరీ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు అన్నారు. గుడ్లవల్లేరు పాల శీతలీకరణ కేంద్రంలో సోమవారం పాడి రైతులకు బోనస్‌ ఆయన పంపిణీ చేశారు. మేనేజింగ్‌ డైరెక్టర్‌ కొల్లి ఈశ్వరరావు, జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘ డైరెక్టర్‌ అర్జా నగేశ్‌, గుడ్లవల్లేరు సంఘ అధ్యక్షుడు వల్లభనేని బాపయ్యచౌదరి(పెదబాబు), విన్నకోట సంఘం అధ్యక్షుడు శాయిన హరిప్రసాద్‌, గుడ్లవల్లేరు పాల శీతలీకరణ కేంద్రం మేనేజర్‌ తోట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement