30 బృందాలు కోవిడ్ వాక్సిన్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాయి : విజయ రాఘవన్

ABN , First Publish Date - 2020-05-28T23:49:15+05:30 IST

పెద్ద పెద్ద పరిశ్రమల యజమానులు, విద్యా వేత్తలు, మరో 30 మంది బృందాలు కరోనా వ్యాక్సిన్ కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయని

30 బృందాలు కోవిడ్ వాక్సిన్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాయి : విజయ రాఘవన్

న్యూఢిల్లీ : పెద్ద పెద్ద పరిశ్రమల యజమానులు, విద్యా వేత్తలు, మరో 30 మంది బృందాలు కరోనా వ్యాక్సిన్ కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయని ప్రిన్సిపల్ సైంటిఫిక్ సలహాదారు కె. విజయ రాఘవన్ గురువారం వెల్లడించారు. వీరందరూ కూడా వాక్సిన్ కోసం చాలా వేగవంతంగా తమ తమ పరిశోధనలు జరుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. దాదాపుగా అయితే ఓ వాక్సిన్ తయారీకి పది సంవత్సరాల కాలం పడితే, తాము మాత్రం ఓ యేడాదిలోనే వాక్సిన్‌ను అందుబాటులోకి తేవడానికి శతధా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.


కొత్త ఔషధాల రూపకల్పన చాలా పెద్ద సవాలుతో కూడుకున్నదని, వాక్సిన్ కూడా చాలా సమయం తీసుకుంటుందని అన్నారు. ఈ కాలంలో చాలా విఫల ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయని, కానీ వాటిని పట్టించుకోకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉండాలని విజయ రాఘవన్ సూచించారు. 

Updated Date - 2020-05-28T23:49:15+05:30 IST