విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో డీఎంఈ ఆకస్మిక తనిఖీలు

ABN , First Publish Date - 2021-09-14T18:16:46+05:30 IST

నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రాఘవేంద్ర రావ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో డీఎంఈ ఆకస్మిక తనిఖీలు

విజయవాడ: నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రాఘవేంద్ర రావ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా  వైద్య సిబ్బందికి  డీఎంఈ పలు సూచనలు ఇచ్చారు. రోగిలే దేవుళ్ళు అని ఆయన అన్నారు. ఆసుపత్రికి వచ్చిన అరగంటలోనే రోగులకు సేవలు అందించాలన్నారు. ఎమర్జెన్సీ వార్డును ఎక్స్టెన్షన్ చేసి బెడ్స్ సంఖ్యను పెంచి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.  గొడవలకు, సమ్మెలకు దిగొద్దని క్యాజువల్ మెడికల్ ఆఫీసర్‌కి డీఎంఈ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారిని పర్మినెంట్ చేసే అవకాశం ఉంటే కచ్చితంగా చేస్తామన్నారు. అనంతరం సెక్యురిటి, శానిటరీ లోపాలను పరిశీలించిన డీఎంఈ రాఘవేంద్ర పలు సూచనలు చేశారు. 

Updated Date - 2021-09-14T18:16:46+05:30 IST