పెళ్లయిన 45 రోజులకే భర్త నుంచి విడాకులు కోరిన భార్య.. అసలు కారణమేంటని అడిగితే ఆమె చెప్పింది విని..

ABN , First Publish Date - 2021-08-02T23:24:26+05:30 IST

వాళ్లిద్దరికీ 45 రోజుల క్రితమే వైభవంగా పెళ్లి చేశారు. రెండు నెలలు కూడా కాకముందే ఆ యువతి భర్తను వదిలి పారిపోయింది. ఈ విషయం తెలిసిన ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పెళ్లయిన 45 రోజులకే భర్త నుంచి విడాకులు కోరిన భార్య.. అసలు కారణమేంటని అడిగితే ఆమె చెప్పింది విని..

ఇంటర్నెట్ డెస్క్: వాళ్లిద్దరికీ 45 రోజుల క్రితమే వైభవంగా పెళ్లి చేశారు. రెండు నెలలు కూడా కాకముందే ఆ యువతి భర్తను వదిలి పారిపోయింది. ఈ విషయం తెలిసిన ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించడానికి ముందే సదరు యువతి ఊళ్లోకి వచ్చేసింది. విలేజ కోర్టు(గ్రామ్ కుచరీ) ముందు నిలబడి తనకు విడాకులు కావాలంటూ గొడవ మొదలు పెట్టింది. దీంతో ఆశ్చర్యపోయిన గ్రామ కోర్టు.. అమ్మాయి తల్లిదండ్రులు, అత్తమామల కుటుంబాలను పిలిపించాడు. అక్కడ ఇరు కుటుంబాల ముందూ ఆమె వాదనలు విన్నారు. ఆ సమయంలో విడాకుల కోసం ఆమె చెప్పిన కారణం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటన బిహార్‌లోని భగల్‌పూర్‌లో జరిగింది.


జహంగీరా గ్రామానికి చెందిన నేహా కుమారి అనే యువతి 12వ తరగతి వరకూ చదువుకుంది. ఆ తర్వాత 19 ఏళ్ల వయసులో తల్లిదండ్రుల ఒత్తిడితో సునీల్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి జరిగిన 45 రోజుల తర్వాత భర్తను వదిలి ఎవరికీ చెప్పకుండా పారిపోయింది. ఆమెపై పోలీసు కంప్లయింట్ నమోదైన సమయానికి విలేజ్ కోర్టు ముందుకొచ్చింది. తనకు పెద్ద చదువులు చదవాలని ఉందని చెప్పిన నేహా కుమారి.. తల్లిదండ్రులుగానీ, అత్తమామలుగానీ తన మాటలు చెవిన వేసుకోవడం లేదని వాపోయింది. భర్త, అత్తమామలు తాను చదువుకోవడానికి ససేమిరా అంటున్నారని తెలిపింది. అందుకే ఇంటి నుంచి పారిపోయానని, తనకు విడాకులు కావాలని డిమాండ్ చేసింది. ‘‘అత్తారింట్లో నాకు ఊపిరి ఆపేసినట్లు ఉంది’’ అంటూ ఏడ్చేసింది. ఈ విషయంలో ఆమెకు, ఇరు కుటుంబాలకు నచ్చజెప్పేందుకు గ్రామ కోర్టు ప్రయత్నించింది. కుదరకపోవడంతో చివరకు విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది.

Updated Date - 2021-08-02T23:24:26+05:30 IST