స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

ABN , First Publish Date - 2020-04-05T10:05:02+05:30 IST

కరోనా వైరస్‌ జిల్లాలో వ్యాపించకుండా అధికార యంత్రాంగం చేపడుతున్న పనుల్లో

స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

సూర్యాపేట(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 4: కరోనా వైరస్‌ జిల్లాలో వ్యాపించకుండా అధికార యంత్రాంగం చేపడుతున్న పనుల్లో భాగస్వామ్యం అయ్యేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి కోరారు. శనివారం కలెక్టరేట్‌లో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో కరోనా వైరస్‌ అనుమానితులు పెరుగుతున్న దృష్ట్యా యంత్రాంగంతో కలిసి పని చేసేందుకు స్వచ్ఛంద సంస్ధలు ముందుకు రావాలని కోరారు. చేపట్టబోయే కార్య క్రమాల వివరాలు మునిసిపల్‌ కమిషనర్లు, మండలాల్లో తహసీల్దార్లకు తెలియజేయాలని సూచించారు. కరోనా వైర్‌సపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు రూపొందించుకోవాలన్నారు. జిల్లాలో ఉన్న వలస కూలీలకు వివిధ రకాల సదుపాయాలు కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి, ఎల్‌.శ్రీనివాస్‌, దయానందరాణి, నర్సింహ్మారావు తదితరులు పాల్గొన్నారు. 


కరోనాపై మీడియా పాత్ర ప్రశంసనీయం : కలెక్టర్‌  

భువనగిరి రూరల్‌: ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేస్తు కరోనాపై విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న మీడియా పాత్ర ప్రశంసనీయమని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా మాస్కులు, సానిటైజర్‌ కిట్లను కలెక్టర్‌ చొరవతో జర్నలిస్టులకు సమకూర్చాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా డీఈఓఓ చైతన్యజైనీ సౌజన్యంతో ఆరోగ్యభద్రతలో భాగంగా సూదగాని ఫౌండేషన్‌ సమకూర్చిన మాస్కులు, సానిటైజర్లను శనివారం డీపీఆర్వో జగదీశ్‌కు అందచేశారు.  కార్యక్రమంలో ఫౌండేషన్‌ అధ్యక్షుడు సూదగాని హరిశంకర్‌, ఏవో నాగేశ్వర చారి, అదనపు కలెక్టర్‌ ఖిమ్యానాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-05T10:05:02+05:30 IST