వర్చ్యువల్‌ సమావేశాలు సాధ్యం కాదు

ABN , First Publish Date - 2021-05-15T07:20:13+05:30 IST

వర్చ్యువల్‌ విధానంలో పార్లమెంటరీ కమిటీలు సమావేశం అయ్యేందుకు అనుమతించాలని ప్రతిపక్ష నేతలు చేసిన డిమాండ్లను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ ఎం. వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా

వర్చ్యువల్‌ సమావేశాలు సాధ్యం కాదు

స్పష్టం చేసిన వెంకయ్యనాయుడు, ఓం బిర్లా


న్యూఢిల్లీ, మే 14 (ఆంధ్రజ్యోతి): వర్చ్యువల్‌ విధానంలో పార్లమెంటరీ కమిటీలు సమావేశం అయ్యేందుకు అనుమతించాలని ప్రతిపక్ష నేతలు చేసిన డిమాండ్లను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ ఎం. వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తిరస్కరించారు. దీనివల్ల సాంకేతిక ఇబ్బందులున్నాయని, సమావేశాల గోప్యతకు సంబంధించిన నిబంధనలు కూడా అనుమతించవని ప్రతిపక్ష నేతలకు సభాధిపతులు తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత సమావేశాలు నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు. దీనికి సంబంధించి రాజ్యసభ సెక్రటేరియట్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.

Updated Date - 2021-05-15T07:20:13+05:30 IST