Abn logo
Oct 20 2020 @ 22:40PM

విశాఖలో మావోల మందుపాతరను భగ్నం చేసిన పోలీసులు

Kaakateeya

విశాఖపట్నం : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మావోల అలజడి మొదలైన సంగతి తెలిసిందే. ఇటీవలే తెలంగాణలోని ములుగు జిల్లాలో మావోలు-పోలీసులు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారు. అయితే ఈ ఘటన జరిగిన రెండ్రోజుల గ్యాప్‌లోనే విశాఖలో మావోలు మందుపాతరలు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. విశాఖ జిల్లాలోని రాళ్లగడ్డ సమీపంలో పోలీసులను చంపాలనే ఉద్దేశంతో మావోయిస్టులు మందుపాతరలు అమర్చారు. రంగంలోకి దిగిన చింతపల్లి పోలీసులు మంగళవారం రాత్రి ఆ మందుపాతరను భగ్నం చేశారు. 


ఇదిలా ఉంటే.. చింతపల్లి పోలీసుల నుంచి కోరుకొండ కమిటీ మిలీషియా సభ్యులు తప్పించుకున్నారు. పోలీసుల నుంచి ఎంతోకాలంగా ఏసీఎంలు కొర్రా నాగేశ్వరరావు, చిక్కుడు చిన్నారావు తప్పించుకు తిరుగుతున్నారు. కొర్ర  నాగేశ్వరరావు, చిక్కుడు చిన్నారావ్ పేర్లు వాడుకుంటూ లబడంపల్లి వాసి కృష్ణారావు సంతలో వ్యాపారస్తులు నుంచి వసూళ్లకు పాల్పడుతున్నాడు. పలువురి ఫిర్యాదు మేరకు సంతలో కోడా కృష్ణారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించిన పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. మావోలకు సంబంధించిన ఒక లాండ్‌మైన్, 2 డిటోనేటర్‌లు, 50 మీటర్ల వైరు, నిప్పో బ్యాటరీలు, ప్రభుత్వ వ్యతిరేకమైన సాహిత్యాలు, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement