ప్రాణం తీసిన ఆన్‌లైన్ కుక్కపిల్ల

ABN , First Publish Date - 2021-06-16T13:21:32+05:30 IST

ఆన్‌లైన్ కుక్కపిల్ల కోసం యువకుడు ప్రాణాలు తీసుకున్న ఘటన విశాఖలో చోటు చేసుకుంది.

ప్రాణం తీసిన ఆన్‌లైన్ కుక్కపిల్ల

విశాఖపట్నం: ఆన్‌లైన్ కుక్కపిల్ల కోసం యువకుడు ప్రాణాలు తీసుకున్న ఘటన విశాఖలో చోటు చేసుకుంది. కుక్కపిల్లను కొనివ్వలేదని ఓ మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వర మెట్ట ప్రాంతానికి చెందిన షణ్ముక వంశీ(17) ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయాడు. ఆన్‌లైన్‌లో చూసిన రూ.10వేల విలువైన కుక్కపిల్ల కావాలని తల్లిని వంశీ కోరారు. ఇంటర్ ముగిసిన తర్వాత కొందామని చెప్పడంతో మనస్థాపం చెందిన వంశీ సోమవారం తల్లి బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖ కేజీహెచ్‌కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-06-16T13:21:32+05:30 IST