విశాఖలో కొవిడ్ 19 నియంత్రణ టీకా కార్యక్రమం ప్రారంభం
ABN , First Publish Date - 2021-01-16T17:12:13+05:30 IST
నగరంలో కోవిడ్ 19 నియంత్రణ టీకా కార్యక్రమం ప్రారంభమైంది.
విశాఖపట్నం: నగరంలో కొవిడ్ 19 నియంత్రణ టీకా కార్యక్రమం ప్రారంభమైంది. చినవాల్తేర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా వేసే ప్రక్రియలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, అధికారులు పాల్గొన్నారు. కొవిడ్ - 19 వ్యాక్సినేషన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ సందేశాన్ని అధికారులు వీక్షించారు. ఇద్దరు వైద్యాధికారులు, జీవీఎంసీ, జిల్లా వైద్యశాఖాధికారుల సమన్వయంతో టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. టీకా వేసిన తరవాత 30 నిముషాలు పాటు అబ్జర్వేషన్‌లో ఉంచనున్నారు.