నెలలో రెండు రోజులు గ్రామాల్లో పర్యటించండి

ABN , First Publish Date - 2021-10-17T05:09:08+05:30 IST

నెలలో రెండు రోజులు వలంటీర్లతో కలిసి సచివాలయ ఉద్యోగులు గ్రామాల్లో పర్యటించాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు.

నెలలో రెండు రోజులు గ్రామాల్లో పర్యటించండి
సచివాలయ ఉద్యోగులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

సచివాలయ ఉద్యోగులకు కల్టెకర్‌ ఆదేశం


చిత్తూరు రూరల్‌, అక్టోబరు 16: నెలలో రెండు రోజులు వలంటీర్లతో కలిసి సచివాలయ ఉద్యోగులు గ్రామాల్లో పర్యటించాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు. శనివారం చిత్తూరు మండలంలోని దిగువమాసాపల్లె గ్రామ సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సచివాలయాల పరిధిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ప్రతినెల చివరి శుక్ర, శనివారాల్లో వలంటీర్లతో కలిసి సచివాలయ ఉద్యోగులు గ్రామాల్లో పర్యటించాలని ఆదేశించారు. ప్రజల విజ్ఞప్తులను స్వీకరించి సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించాలన్నారు. అలాగేఅర్హుందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. మండల అధికారులు కూడా తరచూ సచివాలయాలను సందర్శించాలని సూచించారు. అనంతరం వలంటీర్లతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు అర్హులను ఎంపిక చేసే విధానం, సిటిజన్‌ ఔట్రీచ్‌ కార్యక్రమం గురించి చర్చించారు. సచివాలయ ఉద్యోగులందరూ ప్రతిరోజూ, వలంటీర్లు వారంలో మూడు రోజులు తప్పనిసరిగా బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటరత్నం, ఇన్‌చార్జి తహసీల్దార్‌ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T05:09:08+05:30 IST