విత్తనాల వడ్లు కోసం రైతుల ఆందోళన

ABN , First Publish Date - 2021-12-02T05:15:17+05:30 IST

విత్తనాల వడ్లు రైతులందరికీ కాకుండా కొంతమందికే ఇస్తున్నారంటూ బుధవారం కొమ్మలపూడి రైతులు గ్రామంలోని కమ్యూనిటీ హాల్‌ వద్ద ఆందోళన చేశారు.

విత్తనాల వడ్లు కోసం రైతుల ఆందోళన
కొమ్మలపూడిలో విత్తనాల కోసం ఆందోళన చేస్తున్న రైతులు

 మనుబోలు, డిసెంబరు 1: విత్తనాల వడ్లు రైతులందరికీ కాకుండా కొంతమందికే  ఇస్తున్నారంటూ బుధవారం కొమ్మలపూడి రైతులు గ్రామంలోని కమ్యూనిటీ హాల్‌ వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వరదలకు నార్లు కొట్టుకుపోయిన రైతులకు ప్రభుత్వం 80శాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వమని తెలిపిందన్నారు. అయితే వ్యవసాయ అధికారులు కొంతమంది పేర్లే నమోదు చేసుకుని లేవని చెబుతున్నారన్నారు. వీఏఏ ప్రతాప్‌ విత్తనాల వడ్లు నమోదు కోసం రైతులను రమ్మని పిలిచి, పదిమంది రైతుల నుంచి డబ్బులు కట్టించుకున్నారని,  ఆ తర్వాత ఏవో జహీర్‌ ఫోన్‌ చేయడంతో మిగతా రైతులకు నమోదు చేసుకోకుండా ఆపేశాడు. దీంతో రైతులు వీఏఏతో వాగ్వావాదానికి దిగారు. ఈ క్రమంలో మళ్లీ ఏవో ఫోన్‌ చేసి ఇవ్వమని చెప్పారని, నమోదు చేసుకుంటానని వీఏఏ రైతులకు తెలిపారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  రైతులకు కొంత ఇచ్చి మిగతా విత్తనాలను బ్లాక్‌మార్కెట్‌కు తరలించే ప్రయత్నం జరుగుతోందంటూ రైతులు ఆరోపించారు. 

Updated Date - 2021-12-02T05:15:17+05:30 IST