వలంటీర్లపై.. కన్ను

ABN , First Publish Date - 2021-03-03T05:13:27+05:30 IST

ప్రభుత్వ సంక్షేమ సేవల కోసం వలంటీర్లు నియమితులయ్యారు. అయితే వీరు మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీతో అంటకాగుతూ ప్రచారాల్లో నిమగ్నమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి.

వలంటీర్లపై.. కన్ను

అధికార పార్టీ సేవలో ఉన్నవారిపై చర్యలు ?

ఎస్‌ఈసీ ఆదేశాలతో రంగంలోకి మున్సిపల్‌ అధికారులు

ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు

లేకుంటే కోడ్‌ ఉల్లంఘన కింద చర్యలని హెచ్చరిక


గుంటూరు, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ  సంక్షేమ సేవల కోసం వలంటీర్లు నియమితులయ్యారు. అయితే వీరు మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీతో అంటకాగుతూ ప్రచారాల్లో నిమగ్నమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. దీంతో వలంటీర్ల విషయంలో రాష్ట్ర ఎన్నికల సం ఘం జారీ చేసిన ఆదేశాల దృష్ట్యా ఇక వారిపై ప్రత్యక్ష చర్య లకు తప్పక ఉపక్రమించాల్సిన పరిస్థితి మునిసిపల్‌ అధి కారులకు ఏర్పడింది. తమ  వద్ద ఉన్న లబ్ధిదారుల డేటాని వైసీపీ అభ్యర్థుల చేతుల్లో పెట్టి వారికి ఫోన్లు చేయిస్తూ దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. వైసీపీ అభ్యర్థులతో కలిసి మెడలో ఆ పార్టీ కండువాలు వేసుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నా ఇప్పటి వర కు ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం హెచ్చరికలతో మాత్రమే సరిపెడుతూ వస్తోన్నారు. దీంతో తమకేమి కాద న్న ధోరణి వలంటీర్లలో పెచ్చుమీరిపోయింది. ఈ పరిస్థి తుల్లో ఎట్టకేలకు ఎన్నికల సంఘం వీరి వ్యవహారంపై సీరి యస్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో వలంటీర్లపై మునిసిపల్‌ అధికారులు ఒక కన్నేసి ఉంచాల్సిన పరిస్థితి ఉత్పన్నమైం ది. గత నెలలో మునిసిపల్‌ ఎన్నికల రీషెడ్యూల్‌ని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తేదీ నుంచే ఎన్నికల కోడ్‌ గుంటూరు నగరంతో పాటు ఎలక్షన్లు జరిగే మాచర్ల, తెనా లి, చిలకలూరిపేట, రేపల్లె, సత్తెనపల్లి, వినుకొండ, పిడు గురాళ్లలో అమలులోకి వచ్చేసింది. అయినప్పటికీ వార్డు వలంటీర్లు వైసీపీ అభ్యర్థులతో బహిరంగంగానే ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నట్లు ఆధారాలతో పలువురు ఫిర్యా దులు చేశారు. సంబంధిత సచివాలయాల అడ్మిన్‌ సెక్రట రీలు ఈ విషయంలో హెచ్చరించినా వారు ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా ఎన్నికలు అయిపోయిన తర్వాత అంతా మా పార్టీనే అన్న ధోరణిని ప్రదర్శిస్తున్నట్లు సమా చారం.   ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైసీపీ నాయకుల సిఫా ర్సులతో వలంటీర్లుగా నియామకం పొందిన వారే అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో వారంతా ఇప్పుడు వైసీపీ అభ్యర్థుల సేవలో తరిస్తోన్నారు. ప్రస్తుతం వారు పెన్షన్ల పంపిణీకి మాత్రమే పరిమితమయ్యారు. మిగతా సేవలు ఎన్నికల కోడ్‌ దృష్ట్యా నిలిచిపోయాయి. ఎండీయూ వాహ నాల వెంట వెళ్లి రేషన్‌ పంపిణీలో ఆటంకాలు లేకుండా చూడాల్సి ఉన్నప్పటికీ ఆ విధులకు హాజరు కావడం లేదు.


లబ్ధిదారుల డేటా వైసీపీ వారి చేతుల్లో..

ఉదయం నుంచి రాత్రి వరకు వైసీపీ అభ్యర్థుల వెంటే ఉంటున్నారు. ఇప్పటికే వారి వద్ద ఉన్న డేటాని షేర్‌ చేసే శారు. అమ్మఒడి, పెన్షన్లు, ఆసర, జగనన్న తోడు, పేదలం దరికీ ఇళ్లు, విద్యా దీవెన, టైలర్లు, బార్బర్లు తదితరులకు అమలు చేసిన సంక్షేమ పథకాల డేటా ఇచ్చేశారు. దీంతో వారికి వైసీపీ అభ్యర్థులు ఫోన్లు చేసి ప్రలోభాలకు గురి చేస్తోన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి ఓటు వేయకపోతే తమకు అమలు జరుగుతోన్న సంక్షేమ పథకాలు నిలిచిపో తాయేమోనన్న భయం కూడా ఓటర్లకు పట్టుకొన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం వలంటీర్ల విషయంలో కఠినంగా ఉండాలని ఆదేశాలు జారీ చేయడం చర్చనీ యాంశంగా మారింది. వారి వద్ద ఉన్న ఫోన్లు తీసేసు కోవాలని ఆదేశించింది. సాధారణ విధులకు మినహా ఎన్ని కల పనులకు వినియోగించరాదని, వారు రాజకీయ పార్టీ లు, అభ్యర్థులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పని చేసినా కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా వారి కదలికలపై ఒక కన్నేసి ఉంచాలని స్పష్టం చేసింది. లేకుంటే ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కింద సీరియస్‌ యాక్షన్‌ తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో వలంటీర్లపై ప్రత్యక్ష చర్యలకు ఉపక్రమించాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడింది. 


 

Updated Date - 2021-03-03T05:13:27+05:30 IST