26,98,460

ABN , First Publish Date - 2021-01-16T06:30:01+05:30 IST

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2021లో భాగంగా గత ఏడాది నవంబరులో ముసాయిదా జాబితా ప్రకటించగా, మార్పులు, చేర్పులు, తొలగింపులకు ఈ ఏడాది 1 జనవరి 2021 చివరి తేదీగా నిర్ణయించారు.

26,98,460

ఇది ఉమ్మడి జిల్లా ఓటర్ల సంఖ్య

నల్లగొండ, జనవరి 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/యాదాద్రి: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2021లో భాగంగా గత ఏడాది నవంబరులో ముసాయిదా జాబితా ప్రకటించగా, మార్పులు, చేర్పులు, తొలగింపులకు ఈ ఏడాది 1 జనవరి 2021 చివరి తేదీగా నిర్ణయించారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు, ఓటర్‌గా ఉన్న వారు మార్పులు, చేర్పులు, తొలగింపునకు వచ్చిన దరఖాస్తులు ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు క్షేత్ర స్థాయిలో విచారించి ఈనెల 15న తుది జాబితా ప్రకటించారు. తుది జాబితాపై ఓటరు జాబితా పరిశీలకురాలు అనితా రాజేంద్ర, నల్లగొండ కలెక్టర్‌ పీజే పాటిల్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. 

. నల్లగొండ జిల్లాలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. పురుష ఓటర్లతో పోలిస్తే 2,716 మంది అఽధికం.

. నకిరేకల్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 2,33,080 మంది ఓటర్లు ఉండగా, నాగార్జునసాగర్‌లో 2,16,983 మంది ఓటర్లు ఉన్నారు. 

. నల్లగొండ నియోజకవర్గంలో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. 

. నల్లగొండ, సాగర్‌లో థర్డ్‌ జండర్‌ ఓటర్లు నమోదు కాలేదు. 


  జిల్లా       మొత్తం పోలింగ్‌ స్టేషన్లు     ముసాయిదా ఓటర్లు      చేరికలు    తొలగింపులు  తుది జాబితా  

 నల్లగొండ      1,741                    13,65,891        6,410     17,814           13,54,487

 సూర్యాపేట   1,168                     9,31,515          3,167      7,590          9,27,092

 యాదాద్రి       561                     4,21,271         2,608     6,998          4,16,881

మొత్తం        3,470                    27,18,677        12,185    32,402         26,98,460

యాదాద్రి జిల్లాలో  తగ్గిన ఓటర్లు

యాదాద్రి జిల్లాలో ఓటర్ల సంఖ్య గత జాబితా కంటే తగ్గింది. నవంబరు 2020లో ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితా చేర్పులు మార్పుల అనంతరం జిల్లా వ్యాప్తంగా 4,390మంది ఓటర్ల సంఖ్య తగ్గింది. జిల్లాలోని భువనగిరి, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో  మొత్తం 4,16,881 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,09,152మంది పురుషులుకాగా, 2,07, 727 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు ఉన్నారు. జిల్లాలో 561 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. కొత్తగా 2,608 మంది ఓటర్లు నమోదుకాగా, 6,998 పేర్లను జాబితా నుంచి తొలగించారు. దీంతో మొత్తంగా 4,390 ఓటర్లు తగ్గారు. 

Updated Date - 2021-01-16T06:30:01+05:30 IST