‘అర్హులకు పదోన్నతి కల్పించాలి’

ABN , First Publish Date - 2020-12-05T05:26:59+05:30 IST

అర్హత కలిగిన వీఆర్‌ఏలకు పదోన్నతి కల్పించాలని కోరుతూ జిల్లా వీఆర్‌ఏల సంఘం శుక్రవారం కలెక్టరేట్‌ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేశారు.

‘అర్హులకు పదోన్నతి కల్పించాలి’

కర్నూలు, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): అర్హత కలిగిన వీఆర్‌ఏలకు పదోన్నతి కల్పించాలని కోరుతూ జిల్లా వీఆర్‌ఏల సంఘం శుక్రవారం కలెక్టరేట్‌ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ జూలైలో వీఆర్‌ఏలకు పదోన్నతి కల్పించడానికి ప్రభుత్వం నిబంధనలను విడుదల చేసిందని, ఆ నిబంధనలను మార్చి అనర్హులను అందలం ఎక్కించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆర్డీవోలు ఇచ్చిన నివేదిక ప్రకారం 76 మంది వీఆర్‌ఏలు అనర్హులగా తేలారని, అయి నా వారు పదోన్నతుల జాబితాలో ఎలా ఉన్నారో అధికారులకే తెలియాలన్నారు.  వీఆర్‌ఏ జిల్లా అధ్యక్షుడు కే. మల్లికార్జున్‌, ప్రధాన కార్యదర్శి ఎస్‌. ప్రభాకర్‌, ట్రెజరర్‌ ఎస్‌. గోపీనాథ్‌  పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T05:26:59+05:30 IST