Advertisement
Advertisement
Abn logo
Advertisement

మంత్రి అప్పలరాజు క్షమాపణ చెప్పాలి

మంత్రి సిదిరి అప్పలరాజు వ్యాఖ్యలపై వీఆర్‌వోల ఆగ్రహంపాలకొల్లు టౌన్‌, డిసెంబరు 2 : వీఆర్వోలు సచివాలయాలకు వస్తే తరిమి కొట్టాలంటూ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వీఆర్వోల సంఘాధ్యక్షుడు గుబ్బల శ్రీనివాసరావు అన్నారు.   తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట గురువారం నిరసన తెలిపారు. మంత్రి అప్పలరాజు బేషరతుగా వీఆర్వోలకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో  మండల వీఆర్వోల సంఘ కార్యదర్శి మండపాక రమేష్‌, ఉపాధ ్యక్షుడు రేపాక నాగరాజు, మీసాల శ్రీనివాసరావు, ఆకుల ఆదినారాయణ, శిరిగినీడి వీరాస్వామి పాల్గొన్నారు. 


మొగల్తూరు : మంత్రి సిదిరి అప్పలరాజు వ్యాఖ్యలపై వీఆర్వోలు గురువారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వర్క్‌టూ రూల్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని మండల వీఆర్వోల సంఘాధ్యక్షుడు పంపన సురేష్‌ తెలిపారు.


ఆకివీడు  :  వీఆర్వోలపై మంత్రి సిదిరి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని వీఆర్వోల సంఘాధ్యక్షుడు పి.చైతన్య అన్నారు. తహసీల్దార్‌ కార్యాలయ ప్రాంగణంలో గురువారం నల్లరిబ్బన్లతో నిరసన తెలిపారు. మంత్రి అప్పలరాజు, శ్రీకాకుళం జిల్లా పలాస మునిసిపల్‌ కమిషనర్‌ వెంటనే క్షమాపణలు చెప్పకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. 


నరసాపురం రూరల్‌ : మంత్రి అప్పలరాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని వీఆర్వోల సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి లక్ష్మినారాయణ డిమాండ్‌ చేశారు.  తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వీఆర్వోలు నల్లబ్యాడ్జీలు ధరించి గురువారం మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీఆర్వోలు తమ సమస్యలు చెప్పు కుందామని మంత్రి వద్దకు వెళితే ఉద్యోగం చేస్తున్నారా? ఉద్యమాలు చేస్తు న్నారా అని ప్రశ్నించడం తగదన్నారు. మంత్రి మాటలను వెనక్కితీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వీఆర్వోలు సత్తిబాబు, చిరంజీవి, జయరాం, సూర్యనారాయణ,వెంకటేశ్వరావు, సుధా, భారతి, తులసీ పాల్గొన్నారు. 


ఆచంట : మండలంలోని వీఆర్‌వోలు అందరూ నల్లబ్యాడ్జిలు ధరించి  తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గురువారం నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాస మునిసిపల్‌ కమిషనర్‌ అనుచిత వ్యాఖ్యలపై మంత్రి అప్పలరాజుకు వీఆర్‌వోలు తమ గోడును చెబుదామని కలవగా మంత్రి కూడా వీఆర్‌వోలపై తీవ్రవాఖ్యలు చేయడం దారుణమన్నారు.కార్యక్రమంలో వీఆర్‌వోలు మిరియాల శేషగిరి, ఎ.సీతారాం,అప్పారావు,శ్రీనివాస్‌,నర్శింహరాజు, గోపాలకృష్ణ పాల్గొన్నారు 


భీమవరం రూరల్‌ :  వీఆర్‌వోలు గురువారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సచివాలయాలకు వస్తే  వీఆర్వోలను తరిమేయండి అనడం దారుణమన్నారు.కార్యక్రమంలో వీఆర్వో సంఘం మండల అధ్యక్షుడు రత్నంరాజు, వీఆర్వోలు పెంటమ్మ, రాజమణి, భద్రమ్మ, జక్కరయ్య, హుస్సేన్‌, చైతన్యలు పాల్గొన్నారు. Advertisement
Advertisement