చెట్టుకింద వీఆర్వో

ABN , First Publish Date - 2021-08-05T06:17:51+05:30 IST

తొట్టంబేడు మండలం పెద్దకనపర్తి సచివాలయంలో బెంచీ కేటాయించక పోవడంతో వీఆర్వో వెంకటయ్య చెట్లకిందే విధులు నిర్వహించాల్సి వస్తోంది.

చెట్టుకింద వీఆర్వో
ఆరుబయటే విధులు నిర్వహిస్తున్న వెంకటయ్య

శ్రీకాళహస్తి అర్బన్‌, ఆగస్టు 4: విధి నిర్వహణలో సమన్వయం లేకపోవడం అధికారుల నడుమ ఆఽధిపత్య పోరుకు తెరతీస్తోంది. సచివాలయంలో బెంచీ కేటాయించక పోవడంతో తొట్టంబేడు మండలానికి చెందిన ఓ వీఆర్వో చెట్లకిందే విధులు నిర్వహించాల్సిన ఘటనే ఇందుకు నిదర్శనం. వివరాలివీ.. తొట్టంబేడు మండలం పెద్దకనపర్తి గ్రామ సచివాలయాన్ని ఏడాది కిందట ప్రారంభించారు. అప్పటి నుంచి ఇక్కడ వీఆర్వోగా తూకివాకం వెంకటయ్య పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీఆర్వోను మినహాయించి, కొత్తగా నియమించిన పది మంది ఉద్యోగులకు ఉన్నతాధికారులు బెంచీలు, కుర్చీలను ఏర్పాటు చేశారు. దీంతో తనకు ఓ కుర్చీ, బెంచీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని వెంకటయ్య కోరుతున్నా ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఫలితం లేకపోవడం ఏడాది కాలంగా ఆయన సచివాలయ ఆవరణలోని చెట్ల కిందే సొంత కుర్చీ ఏర్పాటు చేసుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే అధికారులు ఇలా చేస్తున్నారని వీఆర్వో వాపోతున్నారు. కొత్తగా విధుల్లో చేరిన ఉద్యోగులు సీనియర్‌ వీఆర్వోను లెక్కచేయక పోవడంపై గ్రామస్తులు విమర్శిస్తున్నారు. 

Updated Date - 2021-08-05T06:17:51+05:30 IST