టీడీపీ బీసీ నాయకులపై వైసీపీ ప్రభుత్వం కుట్ర

ABN , First Publish Date - 2020-02-22T10:44:07+05:30 IST

టీడీపీ బీసీ నాయకులపై వైసీపీ ప్రభుత్వం కుట్ర

టీడీపీ బీసీ నాయకులపై వైసీపీ ప్రభుత్వం కుట్ర

 వైఫల్యాలు ఎండగడుతున్నందుకే ఎదురు దాడి : ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు 


అనకాపల్లి టౌన్‌, ఫిబ్రవరి 21 : తెలుగు దేశం పార్టీకి చెందిన బీసీ నేతలపై వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం రాత్రి ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. నిన్న బీసీ నాయ కులు యనమల రామకృష్ణుడు, నేడు కింజరపు అచ్చెన్నాయుడుపై మోసపూరిత ఆరోపణలు చేస్తూ వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రభు త్వం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయంటూ  ముఖ్యమంత్రి పత్రిక, మీడియాలో ఇష్టాను సారంగా కథనాలు వల్లిస్తున్నారని, దీనిని  తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. టెలిహెల్త్‌ సర్వీస్‌ కార్యక్రమం తెలంగాణలో అమలులో ఉండగా, అదే పద్ధతిలో రాష్ట్రంలోనూ అమలు చేయాలని అచ్చెన్నాయుడు ఒక నోటును సం బంధిత శాఖకు పంపడం జరిగిందన్నారు. దీనిని ఒక పత్రిక భూతద్దంలో చూస్తుం దన్నారు. విజిలెన్స్‌ నివేదిక పేరా 11లో ఈసీజీ సర్వీసెస్‌, టోల్‌ఫ్రీ సర్వీసెస్‌ కింద మొత్తం రూ.7.96 కోట్లు పనులు మాత్రమే  నామినేషన్‌ కింద కేటా యించినట్లుగా ఉందని పేర్కొ న్నారు. ఇది కూడా అధికారులు చేశారని, అచ్చెన్నాయుడు వందల కోట్లు అవినీతి చేసి నట్టు వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీసీ కార్పొరేషన్‌ నిధులను జగన్‌ ప్రభుత్వం పక్కదారి పట్టిం చిన విషయాన్ని అచ్చెన్నాయుడు వేలెత్తి చూపించారన్నారు. అదేవిధంగా జగన్‌ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తు న్నందుకే ఆయనను ముఖ్యమంత్రి టార్గెట్‌ చేశారని ఆరోపించారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో అక్రమాలు జరిగాయని పనిగట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియా వాస్తవాలను గ్రహించాలని బుద్ద సూచించారు. అచ్చెన్నా యుడు వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయ త్నిస్తున్న ఆ పత్రిక, మీడియాపై చట్టపరమైన చర్యలు కోరనున్నట్టు చెప్పారు. ఈ సమావే శంలో టీడీపీ పట్టణ శాఖ అధ్యక్షుడు డాక్టర్‌ కేకేవీఏ నారాయణరావు, నూకాంబిక ఆలయ మాజీ చైర్మన్‌ కొణతాల వెంకటరావు, పార్టీ పట్టణ శాఖ మాజీ ప్రధాన కార్యదర్శి కుప్పిలి  జగన్మోహనరావు, బీసీ నాయకుడు గోలి వెంకటరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-22T10:44:07+05:30 IST