కొత్త కార్మిక చట్టాలతో తగ్గనున్న ఇబ్బందులు

ABN , First Publish Date - 2021-03-09T06:51:40+05:30 IST

కార్మిక చట్టాలకు కొత్తగా చేసిన సవరణల వల్ల యజమానులకు ఇబ్బందులు తగ్గుతాయని, మరింత మెరుగైన సేవలు అందుతాయని కార్మిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి.ఉదయలక్ష్మి పేర్కొన్నారు.

కొత్త కార్మిక చట్టాలతో తగ్గనున్న ఇబ్బందులు
సదస్సులో మాట్లాడుతున్న కార్మిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉదయలక్ష్మి. వేదికపై ఇతర అధికారులు

కార్మిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి.ఉదయలక్ష్మి

విశాఖపట్నం, మార్చి 8(ఆంధ్రజ్యోతి): కార్మిక చట్టాలకు కొత్తగా చేసిన సవరణల వల్ల యజమానులకు ఇబ్బందులు తగ్గుతాయని, మరింత మెరుగైన సేవలు అందుతాయని కార్మిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి.ఉదయలక్ష్మి పేర్కొన్నారు. నేషనల్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌, విశాఖపట్నం యూనిట్‌ ఆధ్వర్యంలో ‘ కొత్త కార్మిక చట్టాలు... తగ్గుతున్న ఇబ్బందులు’ అనే అంశంపై సోమవారం నిర్వహించిన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ సంస్థల నుంచి హాజరైన 200 మందిని ఉద్దేశించి మాట్లాడుతూ ఏడు దశాబ్దాలుగా కార్మిక చట్టాలకు సవరణ జరగలేదని, ఇటీవల చేసిన మార్పుల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ఫ్యాక్టరీల విభాగం డైరెక్టర్‌ డి.చంద్రశేఖర్‌ వర్మ, బాయిలర్స్‌ విభాగం డైరెక్టర్‌ బి.ఉమామహేశ్వరరావులు వారి విభాగాల్లో నిబంధనల గురించి వివరించారు. జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌ మల్లేశ్వర కుమార్‌ చట్టంలో మార్పులు పేర్కొన్నారు. విశాఖ యూనిట్‌ అధ్యక్షులు, ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ హెచ్‌ఆర్‌ హెచ్‌డీఎస్‌ వర్మ సదస్సుకు అధ్యక్షత వహించగా, సెక్రటరీ భాస్కర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-09T06:51:40+05:30 IST