ట్రాఫిక్‌ నియంత్రించరూ!

ABN , First Publish Date - 2021-04-14T06:06:15+05:30 IST

ట్రాఫిక్‌ నియంత్రించరూ!

ట్రాఫిక్‌ నియంత్రించరూ!
కాటూరు రోడ్డులో ట్రాఫిక్‌తో నిలిచిన వాహనాలు

ఫ అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్‌

ఫ పట్టించుకోని పోలీసులు

ఫనిలిచిపోతున్న వాహనాలు

ఫఇబ్బంది పడుతున్న ప్రజలు

ఉయ్యూరు, ఏప్రిల్‌ 13 :ఉయ్యూరు పట్టణం ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ సమస్యతో స్థానికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధాన సెంటర్‌ నుంచి కాటూరు రోడ్డులో నగర పంచాయతీ ఇటీవల సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయడంతో కరెంటు స్థంబాల మధ్య, రోడ్డుకు ఇరువైపులా ఎక్కడ పడితే అక్కడ ద్విచక్రవాహ నాలు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు నిలుపు తున్నారు. తోట్లవల్లూరు మండలం గ్రామాలు, ఉయ్యూరు నుంచి జాతీయ రహదారికి  వెళ్ళే వాహనాలతో పాటు  తేల ప్రోలు, కాటూరు వైపునుంచి వచ్చే బస్సులు, ఇతర వాహనాలతో అనునిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డులో వాహనాలు తప్పుకునే వీలులేక ట్రాఫిక్‌ నిలిచి పోతుంది.  ఇదే రోడ్డులో పలు ప్రైవేటు వైద్యశాలలు ఉన్న నేపఽథ్యంలో  వాటికి వెళ్లేవారికి ట్రాఫిక్‌ అంతరాయంతో ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా  ప్రధా న సెంటర్‌ సమీపాన  బస్‌స్టాండు రోడ్డులో  పామర్రు, పమిడి ముక్కల  మండలాల గ్రామాలకు వెళ్లే ఆటోలు నిలపడం వల్ల ఇక్కడ కూడా ట్రాఫిక్‌ అంతరాయం కలుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ అడ్డదిడ్డంగా నిలుపుతున్న వాహనాలు నిలుపుతున్నవారి పై చర్యలు తీసుకోపోవడంతో సమస్య నానాటికి పెరుగుతుంది. ప్రధాన సెంటర్‌లో ఒకరిద్దరు హోమ్‌ గార్డులకు ట్రాఫిక్‌ నిమిత్తం డ్యూటీ వేసినప్పటికి వారిపై పర్యవేక్షణ లేక పోవడంతో అంతంత మాత్రంగా ఉంటున్నారు. ఇప్పటికైన పట్టణ పోలీసులు స్పందించి పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని  స్థానికులు కోరుతున్నారు. 

Updated Date - 2021-04-14T06:06:15+05:30 IST