Abn logo
Jun 16 2021 @ 06:43AM

ఆగ్రాలో గోడ కూలి ముగ్గురు పిల్లల దుర్మరణం

ఆగ్రా (ఉత్తరప్రదేశ్): భారీవర్షాల వల్ల గోడ కూలిన ఘటనలో ముగ్గురు పిల్లలు దుర్మరణం చెందిన ఘటన  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో జరిగింది. ఆగ్రా నగరంలోని కాగరోల్ వద్ద వర్షాల వల్ల గోడ కూలి ముగ్గురు పిల్లలు మరణించగా, మరో  ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో 3 నుంచి ఏళ్ల వయసుగల పిల్లలు మరణించిన వారిలో ఉన్నారు. ఇద్దరు బాలికలు, ఓ బాలుడు మరణించారు.శిథిలాల కింద ఉన్న పిల్లలను వెలికి తీసి వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా ముగ్గురు మరణించారని వైద్యులు ప్రకటించారు. క్షతగాత్రులకు  ఆసుపత్రిలో చికిత్స చేపిస్తున్నామని ఆగ్రా జిల్లా మెజిస్ట్రేట్ ప్రభు ఎన్ సింగ్ చెప్పారు.