పీఏబీఆర్‌కు జలకళ

ABN , First Publish Date - 2021-10-17T05:51:17+05:30 IST

పీఏబీఆర్‌(పెన్నహోబిలం బ్యాలెన్సి ంగ్‌ రిజర్వాయర్‌)కు జలకళ సంతరించుకుంది. డ్యాంలోకి 5 టీఎ ంసీల నీరు చేర డంతో ప్రధాన గేటు వెంబడి నీరు బయటకు వస్తోంది

పీఏబీఆర్‌కు జలకళ
పీఏబీఆర్‌ డ్యాంలోకి చేరిన నీరు


రిజర్వాయర్‌లో చేరిన 5 టీఎంసీల నీరు..

జల విద్యుదుత్పత్తి ప్రారంభం

కూడేరు, అక్టోబరు 16: పీఏబీఆర్‌(పెన్నహోబిలం బ్యాలెన్సి ంగ్‌ రిజర్వాయర్‌)కు జలకళ సంతరించుకుంది. డ్యాంలోకి 5 టీఎ ంసీల నీరు చేర డంతో ప్రధాన గేటు వెంబడి నీరు బయటకు వస్తోంది. తుంగ భద్ర డ్యాం నుంచి పీఏ బీఆర్‌ డ్యాంలోకి ఇన ఫ్లో దాదాపు 700 క్యూసె క్కుల ఉంది. దీంతో డ్యాం గేట్ల నుంచి నీరు కిందికి వస్తుండటంతో ఇరి గే షన అధికారులు విద్యుత ఉ త్పత్తికి అనుమతులు  ఇచ్చారు. జల విద్యుత ఉత్పత్తి కేంద్రంలో ఒక టర్బనతో వి ద్యుత ఉత్పత్తిని ప్రారంభించారు. దా దాపు 800 క్యూసెక్కుల నీటిని కరెం టు ఉత్పత్తికి వినియోగిస్తున్నట్లు జెన-కో ఏడీ వేణుగోపాల్‌ తెలిపారు. ప్ర స్తుతం పీఏబీఆర్‌ డ్యాంలో 5 టీ ఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.  నెల రోజుల కిందట దాదాపు 16.50 లక్షల యూనిట్ల వి ద్యుత తయారు చేసినట్లు తెలిపారు. శనివారం రోజున విద్యుత ఉత్పత్తి ప్రారంభించగా రోజుకు లక్ష యూనిట్ల వరకూ ఉత్పత్తి చేస్తామన్నారు. డ్యాంలో నీరు పుష్కలంగా ఉండటంతో పర్యాటకుల తాకిడి అధికమైంది.


Updated Date - 2021-10-17T05:51:17+05:30 IST