తాగునీటికి పరీక్ష ఏదీ?

ABN , First Publish Date - 2021-08-02T05:49:24+05:30 IST

జిల్లాలో తాగునీటి నమూనాలకు పరీక్షలు జరగటం లేదు. లక్షలు వెచ్చించి ప్రభుత్వం నీటి పరీక్షలకు ఇచ్చే సామగ్రి మూలన పడుతోంది. పట్టించుకోవాల్సిన వారు మిన్నకుండిపోతున్నారు. వెరసి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం, పాలకులు పట్టించు కోకపోవడంతో జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు కరువవుతోంది.

తాగునీటికి పరీక్ష ఏదీ?

జనాలకు అందని శుద్ధిజలం 

 క్షేత్రస్థాయి నుంచి పంపని తాగునీటి నమూనాలు 

నీరుగారిన ప్రభుత్వ ఆశయం


అనంతపురం వైద్యం, ఆగస్టు 1: జిల్లాలో తాగునీటి నమూనాలకు పరీక్షలు జరగటం లేదు. లక్షలు వెచ్చించి ప్రభుత్వం నీటి పరీక్షలకు ఇచ్చే సామగ్రి మూలన పడుతోంది. పట్టించుకోవాల్సిన వారు మిన్నకుండిపోతున్నారు. వెరసి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం, పాలకులు పట్టించు కోకపోవడంతో జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు కరువవుతోంది. దీంతో అనేక ప్రాంతాల్లో అపరిశుభ్రమైన నీరు తాగి, ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ప్రజల కు శుద్ధిజలం అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్ర భుత్వాలు వివిధ పేర్లతో పథకాలు రూ పొందిచి తాగునీరు అందించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. జిల్లాలోని 1044 పంచాయ తీల్లో సీపీడబ్ల్యూఎస్‌ పథకాలు 63, ఎంపీడబ్ల్యూఎస్‌ పథకాలు 356, నేరుగా తాగునీటిని పంపింగ్‌ చేసే పథ కాలు 700, దాదాపు 5వేలకు పైగా చేతి పంపులు ద్వారా తాగునీటిని ప్రజలకు అందిస్తున్నారు. ఈ పథకాల ద్వారా తాగునీటిని అందించాలని నీటి శుద్ధిపరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నీటి పరీక్షల నిర్వ హణకు ప్రభుత్వం ప్రత్యేక కిట్లు సరఫరా చేసింది. 2008లో ప్రతి పంచాయతీకి ఓ కిట్టుతో పాటు పరీక్షలకు అవసరమైన రసాయనాలు అందజేశారు. అయితే వాటిని వినియోగించకుండా మూలన  పడేశారు. 2012, 2013లో శుద్ధిజలం కోసం ఫిల్టర్‌ బెడ్స్‌ అందజేశారు. అవికూడా వినియోగించలేదు. తాజాగా 1044 కిట్లు ప్రతి పంచా యతీకి సరఫరా చేశారు. ఒక్కొక్క కిట్టును రూ.1292 వ్యయంతో కొనుగోలు చేసి అందజే శారు. ఈ కిట్ల ద్వారా నీటిలో క్లోరైడ్‌, ఫ్లోరైడ్‌, ఐరన తది తర సాంద్రత ఎంత మేర ఉందో తెలుసుకోవాలి. ఆ నీటి లో లవణాల లభ్యత, సల్ఫర్‌, కాల్షియం శాతం ఎంత మేర ఉందో పరీక్షలో తెలుసుకోవాలి. దీన్ని బట్టి ఆ తాగు నీటిలో స్వచ్ఛత నాణ్యత తెలుసుకొని ప్రజలకు సరఫరా చేసి వారి ఆరోగ్య పరిరక్షణకు శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఎక్కడా ఈ పరీక్షలు నిర్వహించడం లేదు. జిల్లాలో నీటి పరీక్ష ప్రయోగశాలలు 8 ఉన్నాయి. తాగునీటి నమూనాలు ఇక్కడికి పంపితే పరీక్షలు చేసి ఫలితాలు చెబుతున్నారు. ప్రతి మూడు నెలల ఒకసారి ప్రతి పంచాయతీ నుంచి నమూనాలు ఈ ప్రయోగశాలకు పంపాల్సి ఉన్నా ఎక్కడా పంపడం లేదు. కనీసం క్షేత్ర స్థాయిలో కిట్లు ఉన్నా నీటి పరీక్షలు చేయక యంత్రాలు మూలన పడేశారు. దీంతో లక్షల విలువ చేసే పరికరాలు పాడైపోవడంతో పాటు ప్రభుత్వ ఆశయం నీరుగారిపో తోంది. ఉన్నతాధికారులకు తెలిసినా ఏ మాత్రం పట్టించు కోవడం లేదు. జిల్లా కలెక్టర్‌, పాలకులు దృష్టి పెట్టి నీటి పరీక్షలు నిర్వహించి శుద్ధిజలం ప్రజలకు అందేలా చూడాల్సిన అవసరం ఉంది.


Updated Date - 2021-08-02T05:49:24+05:30 IST