నీరందక ఎండుతున్న పంటలు

ABN , First Publish Date - 2022-04-16T04:01:09+05:30 IST

మండలంలోని ఖాజీపల్లి పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ మోటార్లపై ఆధారపడి వరి సాగు చేసిన పొలాలు నీరందక ఎండిపోతున్నాయి. నర్సింగాపూర్‌, ఖాజీప ల్లి, ధర్మారం, దాంపూర్‌ గ్రామాల్లో విద్యుత్‌ కోతలతో నీరం దడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొట్టు దశకు చేరుకుందని, సమృద్ధిగా నీరు ఉంటేనే చేతికి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం రైతులకు 7 గంటలు నిరంతరంగా త్రీఫేజ్‌ విద్యుత్‌ అందిస్తున్నామని చెబుతున్నా అమలు కావడం లేదని పేర్కొన్నారు.

నీరందక ఎండుతున్న పంటలు
ఖాజీపల్లి గ్రామంలో ఎండిన వరి పంట

భీమారం, ఏప్రిల్‌ 15 : మండలంలోని ఖాజీపల్లి పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ మోటార్లపై ఆధారపడి వరి సాగు చేసిన పొలాలు నీరందక ఎండిపోతున్నాయి. నర్సింగాపూర్‌, ఖాజీప ల్లి, ధర్మారం, దాంపూర్‌ గ్రామాల్లో విద్యుత్‌ కోతలతో నీరం దడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొట్టు దశకు చేరుకుందని, సమృద్ధిగా నీరు ఉంటేనే చేతికి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం రైతులకు 7 గంటలు నిరంతరంగా త్రీఫేజ్‌ విద్యుత్‌ అందిస్తున్నామని చెబుతున్నా అమలు కావడం లేదని పేర్కొన్నారు. తెగుళ్లు, చీడపీడల బెడద తట్టుకుని అధిక ఖర్చులతో సతమత మవుతున్న రైతులపై విద్యుత్‌ అంతరాయంతో పంటలు ఎం డిపోయే పరిస్థితులు ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు.  20 రోజుల్లో పంట చేతికి వస్తుందని, నిరంతరంగా విద్యుత్‌ సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.  

Updated Date - 2022-04-16T04:01:09+05:30 IST