హైదరాబాద్‌లో ‘వే టు వాష్’ ప్రారంభం

ABN , First Publish Date - 2020-09-27T03:26:04+05:30 IST

భాగ్యనగరంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో బట్టలు ఉతకడం అనేది అందరికి పెద్ద బర్డెన్‌గానే ఉన్నది.

హైదరాబాద్‌లో ‘వే టు వాష్’ ప్రారంభం

హైదరాబాద్ : భాగ్యనగరంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో బట్టలు ఉతకడం అనేది అందరికి పెద్ద బర్డెన్‌గానే ఉన్నది. మరీ ముఖ్యంగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి సమయంలో బట్టల శుభ్రత చాలా అవసరం. అయితే ఇలాంటి తరుణంలో.. అందరికీ అందుబాటులో ఉండే ధరలో బట్టల శుభ్రత బరువును తగ్గించడానికి ‘వే టు వాష్ డ్రైక్లీనింగ్ సంస్థ’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ.. హాండ్రెడ్ ఫీట్స్ రోడ్డులో ఈ సంస్థ ‘వే టు వాష్ డ్రైక్లీనింగ్’ పేరుతో తొలి ఔట్‌లెట్‌ను ప్రారంభించించడం జరిగింది.


ఉచితంగానే..!

‘వేటు వాష్’ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటే ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా పికప్ అండ్ డ్రాప్‌తో సర్వీసులు అందిస్తున్నామని, పూర్తి హైజీనిక్‌తో ఎంతో నాణ్యమైన సేవలను ఇస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు గరగ సోమన్న, వెంకటసత్యనారాయణ గొల్ల  తెలిపారు. త్వరలోనే జంటనగరాల్లో తమ ఔట్‌లెట్‌లు విస్తరిస్తామని నిర్వాహకులు వెల్లడించారు.

Updated Date - 2020-09-27T03:26:04+05:30 IST