అత్యాచార కేసులో ఆధారాలు సేకరిస్తున్నాం

ABN , First Publish Date - 2020-10-25T07:15:36+05:30 IST

పంజాగుట్ట అత్యాచార బాధితురాలి కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని... కీలక ఆధారాలతో పాటు సాంకేతిక ఆధారాలను కూడా సేకరిస్తున్నామని సీసీఎస్‌ జాయింట్‌ సీపీ అవినాష్‌ మహంతి తెలిపారు

అత్యాచార కేసులో ఆధారాలు సేకరిస్తున్నాం

సీసీఎస్‌ జాయింట్‌ సీపీ అవినాష్‌ మహంతి


హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): పంజాగుట్ట అత్యాచార బాధితురాలి కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని... కీలక ఆధారాలతో పాటు సాంకేతిక ఆధారాలను కూడా సేకరిస్తున్నామని సీసీఎస్‌ జాయింట్‌ సీపీ అవినాష్‌ మహంతి తెలిపారు. సీసీఎస్‌ మహిళా పీఎస్‌ ఏసీపీ శ్రీదేవీ నేతృత్వంలో బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా కేసు విచారణ సాగుతోందన్నారు. బాధితురాలి వాంగ్మూలంతో పాటు వివిధ కోణాల్లో సాగుతున్న ఈ దర్యాప్తులో ఇతరుల ప్రమేయం, పేర్లు వస్తే వారిపై కూడా చర్యలు ఉంటాయని మహంతి పేర్కొన్నారు. 


చివరి స్టేట్‌మెంట్‌ ఆధారంగా దర్యాప్తు..

రెండు నెలల క్రితం ఆగస్టు 20న బాధితురాలు పంజాగుట్ట పీఎ్‌సలో ఫిర్యాదు చేసిన అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకరు.. 139 మంది తనపై అత్యాచారానికి ఒడిగట్టారని... ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేశారని ఫిర్యాదులో పేర్కొంది. వారి పేర్లు, వివరాలు కూడా చెప్పడంతో నిందితుల వివరాలను చేర్చిన పంజాగుట్ట పోలీసులు 100 పేజీల మేర ఎఫ్‌ఐఆర్‌ సిద్ధం చేశారు. కేసు తీవ్రత... నిందితుల్లో ప్రముఖుల పేర్లు ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా కేసును సీసీఎ్‌సకు బదిలీ చేశారు. విచారణలో భాగంగా బాధితురాలిని భరోసా సెంటర్‌ అధికారులు కూడా ప్రశ్నించారు. కేసు సీసీఎ్‌సకు మా రిన తర్వా త అధికారులు తాజా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ కొ నసాగించారు. విచారణంలో కేవలం డాలర్‌ భాయ్‌ మాత్రమే పలుమా ర్లు లైంగికదాడికి పాల్పడ్డాడని బాధితురాలి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. ఆమె ఇచ్చిన చివరి స్టేట్‌మెంట్‌ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిగా ఉన్న డాలర్‌భాయ్‌ని రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2020-10-25T07:15:36+05:30 IST