ప్రతియేటా 3 కోట్ల టన్నుల వరి ధాన్యం పండిస్తున్నాం

ABN , First Publish Date - 2021-10-23T04:40:25+05:30 IST

తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల వరి ధాన్యం పండిస్తున్నామని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

ప్రతియేటా 3 కోట్ల టన్నుల వరి ధాన్యం పండిస్తున్నాం
తిమ్మాపూర్‌లో మాట్లాడుతున్న స్పీకర్‌ పోచారం

బీర్కూర్‌, అక్టోబరు 22: తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల వరి ధాన్యం పండిస్తున్నామని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామ ంలో ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రైతులనుద్దేశించి మాట్లాడారు. 30 ఏళ్లలో పూర్తి చేయాల్సిన కాళేశ్వరంను మూడేళ్లలో పూర్తి చేశారన్నారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నార న్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నా రు. రైతులను అప్పుల ఊబిలో నుంచి బయటకు తీసి వారికి లాభాలు చేకూర్చేలా ప్రణాళికలు రూపొందించారన్నారు. ప్రస్తుతం రైతులకు విరివిగా లాభాలు వస్తున్నాయన్నారు. పంటల మార్పిడి ద్వారా మరిన్ని లాభాలు ఆర్జించేందుకు వీలుగా నూతన పద్ధతులను అవలంభించేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ జితేశ్‌ వి. పాటిల్‌, ఆర్డీవో రాజాగౌడ్‌, శాసన మండలి సభ్యుడు వీజీ గౌడ్‌, బాన్సువా డ నియోజకవర్గ ఇన్‌చార్జీ పోచారం సురేందర్‌రెడ్డి, ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూప, సర్పంచ్‌ రామకుమారి, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్‌, ఏఎంసీ చైర్మన్‌ ద్రోణవల్లి అశోక్‌, శ్రీనివాస్‌రెడ్డి, పెర్క శ్రీనివాస్‌, కమ్మ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న స్పీకర్‌, కలెక్టర్‌

బాన్సువాడ: బీర్కూర్‌ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్‌ జితేశ్‌ వి.పాటిల్‌ లు శుక్రవారం శ్రీవారు, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. కలెక్టర్‌కు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలుకడంతో పాటు శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆలయ సన్ని ధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర శాసన సభాపతి పోచా రం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్‌, శాసన మండలి సభ్యులు వీజీ గౌడ్‌లకు చూయించారు. ఆలయాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ గతంలో రూ.13 కోట్లు అందించారని, తాజాగా మరో రూ.10 కోట్లు అందజేశారన్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన నిధులతోనే ఆలయ సన్నిధిలో అభివృద్ధి పనులు చేపడు తున్నట్లు తెలిపారు. త్వరితగతిన పనులను పూర్తి చేయాలని ఆలయ కమిటీ సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్‌, నియోజ కవర్గ ఇన్‌చార్జీ పోచారం సురేందర్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు మద్దినే ని నాగేశ్వర్‌రావు, నర్సరాజు, సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్‌, ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూప తదితరులున్నారు.

Updated Date - 2021-10-23T04:40:25+05:30 IST