శృంగవరపుకోట రూరల్: కార్తీకమాసం సందర్భంగా ఆలయాల్లో ఖచ్చితమైన కరోనా నిబంధనలను దేవదా యశాఖ ఇన్‌స్పెక్టర్లు, ఈవోల ద్వారా అమలు చేస్తున్నట్లు దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ రంగారావు అన్నారు. సోమవారం మండలంలోని సన్యాసయ్యపాలెం సన్యాసేశ్వరస్వామి ఆలయాన్ని తనిఖీ నిర్వహించారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, కరోనా నిబంధనలు అమలు జరుగుతున్నదీ, లేనిదీ పరిశీలించారు.