Advertisement
Advertisement
Abn logo
Advertisement

రొయ్యల చెరువులతో పంటలు నష్టపోతున్నాం..!

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా

టెక్కలి రూరల్‌: అనుమతులు లేకుండా ఏర్పా టు చేసిన రొయ్యల చెరు వుల కారణంగా పంట పొలాలు నాశన మవు తున్నాయని సంతబొమ్మాళి మండలం హెచ్‌ ఎన్‌ పేట పంచాయతీ పెద్దకేశి నాయుడుపేట, చిన్నకేశి నాయుడు పేట రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు టెక్కలి సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. కోటపాడు రెవెన్యూ గ్రూపులోని మా భూము లకు సమీపంలో అనుమతులు లేని రొయ్యల చెరువులను తొలగించాలని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తక్షణం తగు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని గ్రామానికి చెందిన కోలా భాస్కరరావు ఆధ్వర్యంలో రైతులు డిమాండ్‌ చేశారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌కు వినతిపత్రం అందించారు. 10 రోజుల్లోగా సంబంధిత శాఖాధికారులతో సంయుక్త పరిశీలన చేసి తగు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. 

 

Advertisement
Advertisement