గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి

ABN , First Publish Date - 2022-06-17T05:16:34+05:30 IST

జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల అభివృద్ధికి అధికారులు పాటుపడాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ అన్నారు.

గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌

- అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ 

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 16: జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల అభివృద్ధికి అధికారులు పాటుపడాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ అన్నారు.  జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో గురువారం ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడు తూ గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటుపడాల న్నారు. గ్రామాల్లో రోడ్లపై చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. రోడ్లకిరువైపులా మొక్కలు నాటి సంరక్షించాలని, పల్లె ప్రకృతి వనంలోని మొక్కలు ఏపుగా పెరిగేలా చూడాలన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, విష జ్వరాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

లక్షెట్టిపేటరూరల్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి పనులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ ఆదేశించారు.  లక్షెట్టిపేట మండలం లోని పాత కొమ్ముగూడెంలో గురువారం ఆయన పర్యటించారు. క్రీడా మైదానం స్థలాన్ని, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. పారిశుధ్య పనులను నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు. పల్లె ప్రగతి పూర్తయ్యేలోగా నిర్దేశించిన కార్యక్రమాలను పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సనత్‌కుమార్‌, ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి, ఎంపీవో తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-17T05:16:34+05:30 IST