అందరికీ లబ్ధి చేకూర్చే చట్టం ఎందుకు తేలేదు?: అధీర్ రంజన్

ABN , First Publish Date - 2021-02-11T01:30:02+05:30 IST

రైతు మరణాలకు సంబంధించి తమ (కాంగ్రెస్) ఆందోళనను ప్రధాని మోదీ ప్రస్తావించక..

అందరికీ లబ్ధి చేకూర్చే చట్టం ఎందుకు తేలేదు?: అధీర్ రంజన్

న్యూఢిల్లీ: రైతు మరణాలకు సంబంధించి తమ (కాంగ్రెస్) ఆందోళనను ప్రధాని మోదీ ప్రస్తావించక పోవడం వల్లే తాము లోక్‌సభ నుంచి వాకౌట్ చేసినట్టు లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ ప్రసంగాన్ని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు బహిష్కరించాయి. సభ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం మీడియాతో అధీర్ రంజన్ మాట్లాడుతూ, సాగుచుట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళన సాగిస్తున్న రైతుల్లో 150 మంది మరణించినా ప్రధాని ఆ ప్రస్తావనే చేయకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశామన్నారు. రైతు మరణాలపై తమ ఆందోళనను మోదీ పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు.


'రైతు చట్టాలకు సవరణలు అవసరమని ఆయన (ప్రధాని) అంగీకరిస్తున్నారు. ఈ చట్టాల వల్ల కొన్ని రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయి, కొన్ని రాష్ట్రాలకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని చెబుతున్నారు. ప్రతి ఒక్కరికీ మేలు చేసే చట్టాలు ఎందుకు తీసుకు రాలేదని మేము ప్రధానిని అడుగుతున్నాం' అని అధీర్ రంజన్ చౌదరి అన్నారు.

Updated Date - 2021-02-11T01:30:02+05:30 IST