Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోలీసు సిబ్బందికి అండగా ఉంటాం

ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ 

కడప(క్రైం), డిసెంబరు 3: పోలీసు సిబ్బందికి, వారి కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ భరోసా కల్పించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ ఏఎస్‌ఐ ధర్మేంద్రనాయక్‌, పులివెందుల అర్బన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ఎన్‌.ఉదయ్‌కుమార్‌రెడ్డి, మన్నూరు పీఎ్‌సలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ మరణించిన రాజశేఖర్‌ కుటుంబాలకు ఎస్పీ రూ.2 లక్షల చొప్పున ఆర్థికసాయాన్ని శుక్రవారం చెక్కుల రూపంలో అందజేశారు. పోలీసు వితరణ నిధి నుంచి ఈ సాయాన్ని అందించినట్లు తెలిపారు. కాగా, బద్వేలు అర్బన్‌ పీఎ్‌సలో ఏఎ్‌సఐగా విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యంతో మరణించిన ఎస్‌.ఇక్బాల్‌హుస్సేన్‌ సతీమణికి రూ.4 లక్షల భద్రత చెక్కును ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ ఆర్‌.సావిత్రమ్మ, సీనియర్‌ అసిస్టెంట్‌ హేమలత, బి9 జూనియర్‌ అసిస్టెంట్‌ మహజబీన్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ రాజేశ్వరి, పోలీస్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్‌, ట్రెజరర్‌ గంగరాజు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement