యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తాం

ABN , First Publish Date - 2021-06-21T05:12:52+05:30 IST

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని పర్యా టక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తాం
భూమిపూజ చేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌


మహబూబ్‌నగర్‌, జూన్‌ 20 : లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని పర్యా టక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌న గర్‌ జిల్లా ఓబులాయపల్లి గ్రామాల శివారులో నూతనంగా నిర్మించిన లక్షీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో ఆ దివారం ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి ధ్వజ స్తంభం, కలశ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశా రు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేవాలయాలు ఆధ్మా త్మికతను పెంపొందిస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ఎంతో ప్రతి ష్ఠాత్మకంగా నిర్మిస్తోందని, మన్యంకొండ పరిసర ప్రాంత ఆ లయాలను కూడా అదే తరహాలో అభివృద్ది చేస్తామని చె ప్పారు. అనంతరం ఈ ఆలయం సమీపంలోనే 64 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు, ఎస్పీ రావిరాల వెం కటేశ్వర్లు, నాయకులు రాజేశ్వర్‌గౌడ్‌, కోరమోని వెంకటయ్య, జడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, వైస్‌ ఎంపీపీ సుధ, మన్యంకొండ, అలంపూర్‌ ఆలయాల ఈవోలు శ్రీనివాసరాజు, ప్రేమ్‌కుమా ర్‌, ఆలయ ధర్మకర్త చంద్రమౌళి, డీఈ పాండురంగవిఠల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T05:12:52+05:30 IST