ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాడుతా

ABN , First Publish Date - 2020-09-19T05:30:20+05:30 IST

హుజూరాబాద్‌ ఆస్పత్రిలో ప్రజల పక్షాన మాట్లాడినందుకు గాను తనపై అక్రమ కేసులు పెట్టించారని, ఎన్ని కేసులు పెట్టినా

ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాడుతా

హుజూరాబాద్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సస్పెండ్‌ చేయాలి

ప్రవీణ్‌యాదవ్‌ కుటుంబాన్ని ఆదుకోవాలి

టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డి


హుజూరాబాద్‌, సెప్టెంబరు 18: హుజూరాబాద్‌ ఆస్పత్రిలో ప్రజల పక్షాన మాట్లాడినందుకు గాను తనపై అక్రమ కేసులు పెట్టించారని, ఎన్ని కేసులు పెట్టినా తాను భయడనని టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్‌యాదవ్‌ మృతికి ఒక నిమిషం మౌనం పాటించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు 27న సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆస్పత్రి సందర్శనకు రాగా తాను ప్రవీణ్‌యాదవ్‌ను ఎందుకు ఉద్యోగంలో నుంచి తీసేశారని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రవిప్రవీణ్‌రెడ్డిని ప్రశ్నిస్తే విధులకు అటంకం కలిగించారని తనపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. నియోజకవర్గంలో ప్రశ్నించే వారిని మంత్రి అనగదొక్కుతున్నారన్నారు. బీసీ కుటుంబానికి చెందిన ప్రవీణ్‌యాదవ్‌ మృతి చెందింతే మంత్రి ఇంత వరకు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.


ప్రవీణ్‌యాదవ్‌ తెలంగాణ కోసం, పోరాడిన వ్యక్తి అని అన్నారు. ఆస్పత్రిలో రోగులకు సేవలందించాలని ప్రతిపక్షం తరుపున అడగడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. తనను అరెస్టు చే యడం కోసం వంద మంది పోలీసులను హైద్రాబాద్‌కు పంపించడంలో ఆంతర్యం ఏమిటన్నారు. ప్రవీణ్‌యాదవ్‌ను పోలీసులు చిత్రహింసలకు గురి చేయ డం వల్లనే గుండెపోటుతో చనిపోయాడన్నారు. కాం గ్రెస్‌ పార్టీ నాయకులు కేసులకు భయపడరన్నారు. ప్రవీణ్‌యాదవ్‌ మృతికి కారకుడైన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రవిప్రవీణ్‌రెడ్డిని మంత్రి ఈటల  రాజేంద ర్‌ వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో కేవలం 37 మం ది వైద్య సిబ్బంది ఉండడం వల్ల రోగులకు వైద్య సే వలు అందడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలవడం ఖాయమన్నారు. సమావేశంలో కా ంగ్రెస్‌ నాయకులు సత్యనారాయణరావు,బాబు, రామస్వామి, జితేందర్‌రెడ్డి, సంతోష్‌, వెంకట్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-09-19T05:30:20+05:30 IST