Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిరుద్యోగ సమస్యలపై పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తాం..

-బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత కృష్ణ 

కాగజ్‌నగర్‌ టౌన్‌, నవంబరు 29: నిరుద్యోగులను మోసంచేస్తున్న రాష్ట్రసర్కార్‌పై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని భారతీయ జనతా యువమోర్చా (బీజే వైఎం) రాష్ట్ర ప్రధానకార్యదర్శి అనంతకృష్ణ అన్నారు. సోమవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి 8సంవత్సరాలు అవుతున్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి ఉద్యోగ నోటిఫికేషన్స్‌ ఇవ్వలేదని గుర్తుచేశారు. ఎస్పీఎంలోనూ స్థానికేతరులకు ప్రాధాన్యం ఇస్తు స్థానికుల పొట్టగొడుతున్నారని ఆరోపించారు. నాయకులు ఎలగతి సుచీత్‌, రాజేష్‌, సుధాకర్‌, సందీప్‌, శ్రీకాంత్‌ చారి, శ్రీనివాస్‌, మేడి కార్తీక్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement