‘సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేస్తాం’

ABN , First Publish Date - 2021-06-15T05:43:29+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాని, లేనిపక్షంలో సమ్మెలోకి వెళ్తామని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నంద్యాల శాఖ అధ్యక్షుడు కృష్ణయ్య హెచ్చరించారు.

‘సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేస్తాం’
నంద్యాల మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న కార్మికులు

నంద్యాల, జూన్‌ 14: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాని, లేనిపక్షంలో సమ్మెలోకి వెళ్తామని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నంద్యాల శాఖ అధ్యక్షుడు కృష్ణయ్య హెచ్చరించారు. సోమవారం నంద్యాల మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ 150 మందికిపైగా కార్మికులు బైఠాయించి ధర్నా చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు తోట మద్దులు, కార్మికుల సంఘం కార్యదర్శి భాస్కరాచారి మాట్లాడుతూ  రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులందరినీ క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. ఆప్కాస్‌ విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్‌లో ఉన్న పీఎఫ్‌, ఈఎ్‌సఐ మొత్తాలను కార్మికుల అకౌంట్‌లలో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు రామకృష్ణ, ఆదాం, బసవయ్య, రాజశేఖర్‌, మహేశ్వరరావు, సిద్ధయ్య, పీవీ రమణ, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.


నందికొట్కూరు: మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరు తూ సోమవారం నందికొట్కూరు పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈసందర్బంగా సీఐటీయూ నాయకుడు భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని, ఆప్కాస్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికుల పిల్లలకు అమ్మఒడి వర్తింపజేయాలని, 60ఏళ్లు నిండిన కార్మికుల స్థానంలో వారి పిల్లలను నియమించాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.10లక్షలు చెల్లించాలని డిమాండ్‌ ఏశారు. కార్యక్రమంలో నాయకులు పక్కీర్‌సాహెబ్‌, భాస్కర్‌, సర్వర్‌ఖాన్‌, నాగేశ్వరరావు పాల్గన్నారు. 


ఆళ్లగడ్డ: మున్సిపాల్టీ కార్యాలయంలో పని చేస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మున్సిపాల్టీ కార్యాలయం ఎదుట  రెండు రోజుల  సమ్మెలో భాగంగా సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సంద ర్భంగా కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 11వ పీఆర్సీ ప్రకారం కనీస వేతనం రూ. 24 వేలు ఇవ్వాలని, ఆప్కాస్‌ వద్దని,  కాంట్రాక్టు కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండు చేశారు. కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 54 మంది కార్మికులు చనిపోయారని, కేంద్ర ప్రభుత్వం చనిపోయిన కార్మిక కుటుంబానికి రూ.50 లక్షలు ఇస్తామని ప్రకటించి ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికుల సంఘం నాయకులు నరసరాముడు, సుబ్బరాయుడు, కృపానందం తదిత రులు పాల్గొన్నారు.


కార్మికులకు, ఎస్‌ఐకి మధ్య వాగ్వాదం: కార్మికులు తమ డిమాండ్ల కోసం ధర్నా చేస్తుండగా పట్టణ ఎస్‌ఐ రామాంజనేయులు అక్కడకు చేరుకొని పట్టణంలో ర్యాలీ చేసేందుకు కరోనా కారణంగా అనుమతించమని చెప్పటంతో తాము పాత బస్టాండు వరకు ర్యాలీ చేస్తామని ఆందోళనకారులు అన్నారు. ఈ సందర్భంగా కొద్ది సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు కార్మికులు కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని చెప్పటంతో పరిస్థితి సర్దుమణిగింది. 


ఆత్మకూరు: పురపాలకశాఖలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులను క్రమబద్ధీకరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రజాక్‌, రణధీర్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు నాగన్న, నాగరాజు  పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం తమ డిమాండ్ల సాఽధన కోసం చేపట్టిన సమ్మెలో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అప్కాస్‌ విధానాన్ని తీసుకొచ్చి కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిపారు. అప్కాస్‌ వల్ల పీఎఫ్‌, ఈఎ్‌సఐ వాటాలు కార్మికుల ఖాతాల్లోకి జమ కావడం లేదని అన్నారు.  ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ప్రసాద్‌, తిమ్మయ్య, రామకృష్ణ, బీసన్న, నరసింహులు, రాజేంద్ర, శిఖామణి, రాములమ్మ, మరియమ్మ, తిమ్మయ్య, బాలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-15T05:43:29+05:30 IST