Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రభుత్వరంగ సంస్థలు నిర్వీర్యం

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధిచెప్పాలి

 సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి

యాదాద్రి రూరల్‌, డిసెంబరు 2: ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధిచెప్పాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్టలో గురువారం నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా పార్టీ రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. ఆర్‌ఎ్‌సఎస్‌ ఎజెండాను బీజేపీ అమలుచేస్తోందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేయడంతో కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బూర్జువా ప్రాంతీయ పార్టీలు కులాల మధ్య చిచ్చుపెడుతూ పబ్బం గడుపుతున్నాయన్నారు. కులం, మతం, ప్రాంతం అనే బేధాభిప్రాయాలు లేకుండా కమ్యూనిస్టులు ప్రజాసమస్యలపై దృష్టిసారించి రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ రెండు రోజుల శిక్షణ తరగతులు మార్క్స్‌, లెనిన్‌ సిద్ధాంతాలపై అవగాహన పెంచుకొని, ఆచరించేందుకు దోహదపడతాయన్నారు. అంతకు ముందు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పల్లా నరసింహారెడ్డి, ఉమ్మడి జిల్లా పార్టీ కార్యదర్శులు గోద శ్రీరాములు, నెల్లికంటి సత్యం, బెజవాడ వెంకటేశ్వర్లు, నాయకులు యానాల దామోదర్‌రెడ్డి, బొలగాని సత్యనారాయణ, కొల్లూరు రాజయ్య, బండి జంగమ్మ, బబ్బూరి శ్రీధర్‌, పేరబోయిన పెంటయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గోరేటి రాములు, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement