పశ్చిమ బెంగాల్లో కరోనా రోగి మృతి.. 30కి చేరిన మృతుల సంఖ్య..

ABN , First Publish Date - 2020-03-30T16:02:48+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారత దేశంలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. 44 ఏళ్ల ఓ మహిళ నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స..

పశ్చిమ బెంగాల్లో కరోనా రోగి మృతి.. 30కి చేరిన మృతుల సంఖ్య..

కోల్‌కతా: కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారత దేశంలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. 44 ఏళ్ల ఓ మహిళ నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఇవాళ అధికారులు ప్రకటించారు. ‘‘పశ్చిమ బెంగాల్‌లో కరోనా వైరస్ కారణంగా మరొకరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 2కు చేరింది...’’ అని సీనియర్ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. కాగా ఆమె మృతితో భారత్‌లో ఇప్పటి వరకు కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 30కి చేరింది.


దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటినట్టు నిన్న కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్లో 21 మందికి కోవిడ్-19 పాజిటివ్‌ ఉన్నట్టు గుర్తించారు. కాగా అన్ని రాష్ట్రాలకంటే ఎక్కువగా మహారాష్ట్రలో 215 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో 180 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. మరోవైపు అసోంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.

Updated Date - 2020-03-30T16:02:48+05:30 IST