Abn logo
Oct 24 2020 @ 09:51AM

మహిళ కాళ్లపై నుండి వెళ్లిన ఆర్టీసీ బస్సు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఉండి బస్టాండ్‌లో గత రాత్రి మహిళ కాళ్ల పైనుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. బాధితురాలు చెత్త కాగితాలు ఏరుకునే మహిళగా గుర్తించారు. రాత్రి బస్ స్టాండ్ అంధకారంలో ఉండటంతో  బస్ డ్రైవర్ గమనించకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా రెండు గంటలపాటు అంబులెన్స్ రాకపోవడంతో మహిళ నరకయాతన అనుభవించింది. చివరికి ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. 


Advertisement
Advertisement
Advertisement