ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ వయ్యేరు ఏటిగట్టుపై మహిళ దారుణ హత్యకు గురైంది. కుటుంబ కలహాల కారణంగా భార్య పచ్చల వరలక్ష్మి (35)ని భర్త శ్రీను పీక కోసి హత్య చేశారు. వీరు స్థానికంగా కోళ్లఫారంలో పని చేసేవారుగా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.