Abn logo
May 5 2021 @ 11:53AM

ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో బెడ్లు ఫుల్

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో కరోనా రోగులతో బెడ్లన్నీ నిండిపోయాయి. దీంతో ఆసుపత్రి బయట బెంచ్‌లపైన, అంబులెన్స్‌లోనే రోగులకు ఆక్సిజన్ పెట్టి సిబ్బంది చికిత్స అందజేస్తున్నారు. బాధితులకు అత్యవసర వైద్యం అందించి, తర్వాత బెడ్‌లు ఖాళీ ఉన్న ఆసుపత్రులకు పంపుతామని వైద్య అధికారులు తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement