పోటా పోటీగా..

ABN , First Publish Date - 2021-03-04T04:45:46+05:30 IST

పురపోరులో అభ్యర్థులు సై అంటే సై అంటున్నారు. ఎక్కడా ఏ ఒక్కరూ తగ్గడం లేదు.

పోటా పోటీగా..

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

అన్ని పార్టీల నుంచి బరిలో అభ్యర్థులు

28 వార్డుల్లో 95 మంది మధ్య పోటీ

నిడదవోలు, మార్చి 3 : పురపోరులో అభ్యర్థులు సై అంటే సై అంటున్నారు. ఎక్కడా ఏ ఒక్కరూ తగ్గడం లేదు. అన్ని పార్టీల నాయకులు పోటీపడుతున్నారు. నిడదవోలు పురపాలక సంఘంలో 28 వార్డులు ఉన్నాయి. అన్ని వార్డుల్లోనూ అభ్యర్థులు బరిలో నిలి చారు. దాదాపుగా అన్ని పార్టీలు పోరులో నువ్వా నేనా అంటు న్నారు. చాలా వార్డుల్లో త్రిము ఖ పోరు నెలకొంది.మునిసిపాలిటీలో మొత్తం 161 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహ రణలు ప్రారంభమైన తొలిరోజు మంగళవారం 15 నామినేషన్లు, రెండవ రోజు బుధవారం 55 నామినేషన్లు డమ్మీ అభ్యర్థులు ఉప సంహరించుకున్నారు.70 మంది డమ్మీ నామినేషన్లు ఉపసంహరిం చుకోగా 91 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో టీడీపీ 28 మంది, వైసీపీ 28 మంది, కాంగ్రెస్‌ 11 మంది, బీజేపీ 8 మంది, జనసేన 7, ఇండిపెండెంట్లు 7 , సీపీఎం 2,మొత్తం 95 అభ్యర్థులు బరిలో నిలిచినట్టు మునిసిపల్‌ కమిషనర్‌ కెవి.పద్మావతి తెలిపారు. ఇప్పటికే అభ్యర్థులు ప్రచారంలో తలమునకలవుతున్నారు.

Updated Date - 2021-03-04T04:45:46+05:30 IST