మార్చి వచ్చినా అందని ఫిబ్రవరి నెల రేషన్‌

ABN , First Publish Date - 2021-03-04T04:47:50+05:30 IST

ఇంటింటికీ రేషన్‌ పంపిణీ ఆది నుంచి అనేక అవాంతరాలు ఎదుర్కొంటూనే ఉంది.

మార్చి వచ్చినా అందని ఫిబ్రవరి నెల రేషన్‌

ఇరగవరం, మార్చి 3: ఇంటింటికీ రేషన్‌ పంపిణీ ఆది నుంచి అనేక అవాంతరాలు ఎదుర్కొంటూనే ఉంది.   ఫిబ్రవరి నెల మొదట్లో ఎన్నికల కోడ్‌ కారణంగా రేషన్‌ పంపిణీ  వాయిదా పడింది. ఫలితాల అనంతరం ఫిబ్రవరి నెల కోటా 15వ తేదీ నుంచి రేషన్‌ పంపిణీ కార్యక్రమం ప్రారం భించారు. మార్చి నెల 3వ తేదీ వచ్చినప్పటికీ ఫిబ్రవరి కోటా పూర్తి కాకపోవ డంతో లబ్దిదారులు ఎందుకొచ్చిన ఇంటింటి పంపిణీ అంటూ బహిరంగంగానే విమర్శిస్తున్నారు.  ప్రజలకు ఇబ్బంది లేకుండా  పాత విధానాన్నే కొనసాగిస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు.


పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలి

అత్తిలి:  ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్‌ ప్రజలకు ఇబ్బందిగా మారిందని పాత పద్ధతిలోనే పంపిణీ  చేయాలని టీడీపీ నాయకుడు కౌరు విదురుడు డిమాండ్‌ చే శారు. ఇంటింటికి రేషన్‌ ఇస్తామని చెప్పినప్పటికీ సకాలంలో రేషన్‌ అందక  ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇది పునరావృతం కాకుండా ఉండాలంటే పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలని కోరారు. 


Updated Date - 2021-03-04T04:47:50+05:30 IST